AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: 7.2 తీవ్రతతో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనాలు!

దక్షిణ పెరూలో భారీ భూకంపం బీభత్సం సృష్టంచింది. అండాహుయ్లాస్‌ సహా పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కపించడంతో భయబ్రాంతులకు గురైన జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ భూకంపం సంభవించగా.. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 7.2గా నమోదైనట్టు అధికారులు తెలిపారు.

Earthquake: 7.2 తీవ్రతతో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనాలు!
Magnitude Earthquake Strikes Southern Peru
Anand T
|

Updated on: Aug 21, 2026 | 8:44 AM

Share

సౌత్ అమెరికాను మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. దక్షిణ పెరూలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. పలు ప్రాంతాల్లో భవణాలు, గోడలు కుప్పకూలాయి. కొన్ని ప్రాంతాల్లో భవనాలకు పగుళ్లు వచ్చాయి. ముఖ్యంగా అండాహుయ్లాస్‌ సహా పలు ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. అంతేకాదు రాజధాని లిమాలోనూ స్వల్ప ప్రకంపనలు వచ్చాయని.. కానీ ఈ ప్రమాదం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం లేదని స్థానిక మీడియాలు పేర్కొన్నాయి.

అయితే అయకుచో ప్రాంతంలోని పరినాకొచాస్‌ ప్రావిన్స్‌లో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించిన పెరూ జియోఫిజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధికారులు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదైనట్టు తెలిపారు. భూమికి 108 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఏర్పడినట్టు అధికారులు స్పష్టం చేశారు. కొరాకోరాలో మెర్కల్లి స్కేల్‌పై 3 నుంచి 4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని గుర్తించారు. అయితే ప్రస్తుతం సునామీ హెచ్చరిక జారీ కాలేదని పెరూ నేవీ వెల్లడింది. ఈ భూకంపం పరిస్థితిని పెరూ జియోఫిజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సౌత్ పెరూలో భూకంపాలు సంభవించడం ఇది కొత్తే కాదు గతంలోనూ చాలా సార్లు ఇక్కడ భూకంపాలు సంభవించాయి. ఇది తరచుగా భూకంపాలు సంభవించే ప్రాంతమైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో భాగం కావడంతో ఇక్కడ ఎక్కవుగా భూకంపాలు సంభవించే ఛాన్స ఉంది. అంతేకాదు ఇకా ప్రాంతంలో 2007లో ఒక ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపం దాటికి సుమారు 600 మంది ప్రాణాలను కోల్పోయారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
45 పైసలతో రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. చేరడం మర్చిపొవద్దు..
45 పైసలతో రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. చేరడం మర్చిపొవద్దు..
ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి..
ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి..
ఫ్రిజ్‌లో పెట్టినా బెండకాయలు నల్లగా మారుతున్నాయా? ఈ తప్పు చేయకండి
ఫ్రిజ్‌లో పెట్టినా బెండకాయలు నల్లగా మారుతున్నాయా? ఈ తప్పు చేయకండి
ముఖానికి నెయ్యి రాస్తే మొటిమలు వస్తాయా? డాక్టర్ల సలహా ఇదే!
ముఖానికి నెయ్యి రాస్తే మొటిమలు వస్తాయా? డాక్టర్ల సలహా ఇదే!
విద్య, వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
విద్య, వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
పళ్లు తోముకున్నా నాలుకను శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
పళ్లు తోముకున్నా నాలుకను శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
శ్రీకాంత్, ఊహల ప్రేమకథ ఎలా మొదలయ్యిందో తెలుసా..
శ్రీకాంత్, ఊహల ప్రేమకథ ఎలా మొదలయ్యిందో తెలుసా..
కుండీ ఉంటే చాలు.. బాల్కనీ నిండా గుత్తులు గుత్తులుగా టమాటా పండ్లు
కుండీ ఉంటే చాలు.. బాల్కనీ నిండా గుత్తులు గుత్తులుగా టమాటా పండ్లు
ఆకుకూరలు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా?..ఈ మిస్టేక్ చేయొద్దు
ఆకుకూరలు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా?..ఈ మిస్టేక్ చేయొద్దు
నోట్లోవేస్తే వెన్నెలా కరిగిపోయే గులాబ్ జామున్.. సూపర్ టిప్స్‌తో
నోట్లోవేస్తే వెన్నెలా కరిగిపోయే గులాబ్ జామున్.. సూపర్ టిప్స్‌తో