మరో ఘోర విమాన ప్రమాదం..! టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది..
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత, లండన్‌లోని సౌత్ ఎండ్ విమానాశ్రయంలో మరో భయంకరమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే B200 విమానం కూలిపోయింది. పెద్దఎత్తున పేలుడు, మంటలు సంభవించాయి. ప్రమాదానికి సంబంధించిన వివరాలు వెలువడే వరకు వేచి చూడాల్సి ఉంది.

London Plane Crash
అహ్మాదాబాద్ విమాన ప్రమాద దుర్ఘటన మరవక ముందే.. మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లండన్‌లో చోటు చేసుకుంది. లండన్‌లోని సౌత్‌ఎండ్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం కుప్పకూలింది. ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే బీ200 అనే విమానం కూలిపోయింది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున పేలుడు, మంటలు సంభవించాయి. ఈ ప్రమాదంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, ఎన్ని మంది గాయపడ్డారో ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
