Volcano Blast: ఇంకా శాంతించని ‘మౌనా లోవా‘ అగ్నిపర్వతం.. కిలోమీటర్ల మేర ఎగజిమ్ముతోన్న లావా..

|

Dec 04, 2022 | 6:58 AM

లావా దెబ్బకు హవాయి ద్వీపం అల్లాడుతోంది. రోజురోజుకీ భీకరంగా మారుతోన్న అగ్నిపర్వతం అలజడి సృష్టిస్తోంది. నిప్పులు కక్కుతూ పెద్దఎత్తున లావా ఎగజిమ్ముతోంది.

Volcano Blast: ఇంకా శాంతించని ‘మౌనా లోవా‘ అగ్నిపర్వతం.. కిలోమీటర్ల మేర ఎగజిమ్ముతోన్న లావా..
Mauna Loa Eruption
Follow us on

ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతం ‘మౌనా లోవా‘ అరివీర భయంకరంగా మారుతోంది. నిప్పులు కక్కుతూ పెద్దఎత్తున లావా ఎగజిమ్ముతోంది. ఊహించనిస్థాయిలో 25 అడుగుల ఎత్తువరకు లావా ఎగిసిపడుతోంది. లావా పైకి ఎగజిమ్ముతుంటే వాటర్‌ ఫౌంటెయిన్స్‌ను తలపిస్తోంది. పసిఫిక్‌ మహాసముద్రంలోని హవాయి ద్వీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం ఇప్పటివరకు 33సార్లు పేలింది. 1843 నుంచి దడ పుట్టిస్తోన్న ‘మౌనా లోవా‘ కొన్నేళ్లు బ్రేక్‌ ఇచ్చింది. 1984 తర్వాత మళ్లీ ఇప్పుడు ఒక్కసారిగా పేలింది.

గత నెల 27నుంచి కిలోమీటర్ల మేర లావా వెళ్లగక్కుతోంది. దాంతో, పరిసర ప్రాంతాలు బూడిద, పొగతో నిండిపోతున్నాయ్‌. లావా ప్రవాహం ఎప్పుడు ఆగుతుందో అంచనా వేయలేకపోతున్నారు సైంటిస్టులు. ప్రస్తుతం గంటకు 60 మీటర్ల వేగంతో సాగుతోంది లావా ప్రవాహం. గతంలో రెండు మూడు వారాలపాటు సాగిన లావా ప్రవాహం, ఇప్పుడు ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేకపోతున్నారు శాస్త్రవేత్తలు.

అరివీర భయంకరంగా మారిన ‘మౌనా లోవా‘ అగ్నిపర్వతాన్ని చూడటానికి హవాయి ప్రాంతానికి క్యూ కడుతున్నారు టూరిస్టులు. వాటర్‌ ఫౌంటెయిన్ మాదిరిగా ఎగజిమ్ముతోన్న లావాను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. అగ్నిపర్వతం ముందు ప్రజలు ఫోటోలకు పోజులిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..