AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump: మళ్లీ స్టార్ట్.. ఇరాన్‌తో యుద్ధంపై డోనాల్డ్‌ ట్రంప్ సంచలన ప్రకటన.. ఏమన్నారంటే?

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు కమ్మకున్నాయి. ఇటీవలే ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై తాజాగా డోనాల్డ్‌ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో కుదుర్చుకున్న శాంతి ఒప్పదం గడువు ముగిసిపోయిందని బాంబు పేల్చాడు. టర్కీలో జరిగిన నాటో సదస్సు వేదికగా డోనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Donald Trump: మళ్లీ స్టార్ట్.. ఇరాన్‌తో యుద్ధంపై డోనాల్డ్‌ ట్రంప్ సంచలన ప్రకటన.. ఏమన్నారంటే?
Trump Declares Iran Peace Deal Expired
Anand T
|

Updated on: Jul 08, 2026 | 4:45 PM

Share

గత 3 వారాల క్రితం ఇరాన్‌తో కుదుర్చుకున్న శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గడువు ముగిలిపోయిందన్నారు. హార్ముజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతికారంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అమెరికా దాడులు చేసిన కొన్ని గంటలకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం టర్కీలో జరిగిన నాటో సదస్సులో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇటీవల రెండు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దానికి సమాధానం ఇస్తూ డోనాల్డ్ ట్రంప్ ఇలా అన్నారు. తన దృష్టిలో ఆ MoU ముగిసిపోయిందని.. ఇకపై వారితో లావాదేవీలు జరపడం తనకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. వారు నకిలీలు,మానసిక రోగులు, వారు హింసాత్మక స్వభావం ఉన్నవారు. ఒకవేళ వారి దగ్గర అణ్వాయుధం ఉంటే, వారు ఖచ్చితంగా దాన్ని వాడేస్తారు అని ట్రంప్ అన్నారు. అయితే ట్రంప్ ఈ ప్రటకన చేసిన కాసేపటికే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 3శాతం పెరిగినట్టు తెలుస్తోంది.

అయితే, ఇరుపక్షాల చర్చల ప్రతినిధులు సంప్రదింపులు కొనసాగించవచ్చని.. ఆ చర్చల వల్ల జరిగేదేమి లేదని.. అదంతా టైం వేస్ట్ యవ్వారమని ట్రంప్ కొట్టిపారేశారు. అలాంటి పిచ్చివాళ్లతో మాట్లాడటం వల్ల వచ్చే లాభం ఏమీ లేదని నొక్కి చెప్పారు. అటు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా గతంలో ఇలాంటి ధోరణినే అవలంబించింది. అమెరికా చర్యల వల్ల యుద్ధాన్ని ముగించే ఒప్పందంలోని ప్రాథమిక అంశాలు నిరుపయోగం అయ్యాయని పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us