India-Canada: దశాబ్దాలుగా భారత్‌పై విషం చిమ్ముతున్న కెనడా.. అసలు కారణం అదేనా..!

|

Oct 15, 2024 | 10:50 AM

భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాల్లో మరోసారి బీటలు వారాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.

India-Canada: దశాబ్దాలుగా భారత్‌పై విషం చిమ్ముతున్న కెనడా.. అసలు కారణం అదేనా..!
Trudeau Father Pierre
Follow us on

భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాల్లో మరోసారి బీటలు వారాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఖలిస్తానీ మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు సంబంధించిన దర్యాప్తులో భారత హైకమిషనర్ ప్రమేయంపై కెనడా ప్రభుత్వం చేసిన ఆరోపణల తర్వాత ఈ దుమారం రేగింది.

ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తన దౌత్యవేత్తను లక్ష్యంగా చేసుకుని కల్పిత ఆరోపణలకు వ్యతిరేకంగా కఠినమైన హెచ్చరిక జారీ చేసింది. ఇది ట్రూడో రాజకీయ ప్రయోజనం కోసం ఉద్దేశించిన చర్య అని పేర్కొంది. అయితే భారతదేశం-కెనడా సంబంధాలలో ఉద్రిక్తత చరిత్ర దశాబ్దాల నాటిది. అయితే తాజా ఉద్రిక్తత సెప్టెంబర్ 2023 నుండి కొనసాగుతోంది.

జూన్ 2022లో కొలంబియాలోని సర్రేలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు పాల్పడినట్లు గత సంవత్సరం, ట్రూడో భారతీయ ఏజెంట్లపై ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు సోమవారం నాడు ట్రూడో మరోసారి భారత్‌పై ఇలాంటి ఆరోపణలు చేశారు. భారత్ – కెనడా మధ్య సంబంధాలలో ఉద్రిక్తత కొత్తది కాదు. కానీ జస్టిన్ ట్రూడో తండ్రి పియరీ ఇలియట్ ట్రూడో కెనడా ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, భారత్ – కెనడా మధ్య సంబంధాలు క్షీణించాయి. దీంతో ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు జస్టిన్ ట్రూడో కూడా తన తండ్రి బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది.

1974లో భారతదేశం అణు పరీక్షల సమయంలో కెనడాతో చారిత్రక ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. అప్పటి కెనడా ప్రధాని ట్రూడో తండ్రి పియరీ ట్రూడో ప్రభుత్వం పరీక్షలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 1998లో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో భారతదేశం జరిపిన అణు పరీక్ష తర్వాత ఈ ఉద్రిక్తత మరింత తీవ్రమైంది. చైనా నుండి భద్రతాపరమైన బెదిరింపులు, దేశీయ, బాహ్య కారకాల దృష్ట్యా నిర్వహించిన అణు పరీక్ష ఇది. కెనడాతో సహా చాలా పాశ్చాత్య దేశాలతో భారతదేశ సంబంధాల క్షీణతకు దారితీసింది. కెనడా భారత్ పరీక్షను ద్రోహంగా భావించింది. అప్పటి విదేశాంగ మంత్రి మిచెల్ షార్ప్ నిరాశ వ్యక్తం చేస్తూ ఇరు దేశాల మధ్య నమ్మకం పోయిందని అన్నారు. కెనడియన్ విధాన నిర్ణేతలు భారతదేశం అణు సామర్థ్యాలు అణ్వాయుధ రహిత దేశాలను ఇలాంటి ప్రయత్నాలు చేయడానికి ప్రేరేపిస్తాయన్నారు.

1980వ దశకంలో, పంజాబ్‌లో ఖలిస్తానీ తీవ్రవాదుల సంఘటనలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడుభారత ప్రభుత్వం తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించింది. భారతదేశం నుండి పారిపోతున్న ఖలిస్తానీలకు కెనడా ఇష్టమైన గమ్యస్థానంగా మారింది. పియరీ హయాంలో చాలా మంది ఖలిస్తానీలు భారత ప్రభుత్వం నుండి తప్పించుకుని కెనడాలో ఆశ్రయం పొందారు. 1981లో పంజాబ్‌లో ఇద్దరు పోలీసులను హతమార్చిన తర్వాత ఖలిస్తానీ గ్రూపు బబ్బర్ ఖల్సా సభ్యుడు తల్వీందర్ సింగ్ పర్మార్ కెనడాకు పారిపోయాడు. పర్మార్‌ను అప్పగించాలని భారతదేశం కోరినప్పుడు, పియర్ ట్రూడో పరిపాలన భారతదేశ అభ్యర్థనను తిరస్కరించింది. భారత నిఘా వర్గాల హెచ్చరికలను కూడా ఖాతరు చేయలేదు.

1985 జూన్ 23న ఎయిరిండియా ఫ్లైట్‌లో బాంబు పేలుడు జరిగిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. ఇందులో 329 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది కెనడియన్లు. పర్మార్ ఈ దాడికి సూత్రధారిగా పరిగణిస్తారు. కానీ పియరీ ట్రూడో ప్రభుత్వం అతనిని విచారించలేదు. బాంబు దాడికి సంబంధించి ఒక వ్యక్తి మాత్రమే దోషిగా నిర్ధారించారు. ఖలిస్థానీ బలగాలపై కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కూడా పియరీ ట్రూడోకు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కెనడా ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు.

అణు పరీక్షలు, పంజాబ్ చీకటి రోజుల నుంచి భారతదేశం – కెనడా మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. భారత్‌పై కుట్ర పన్నుతున్న ఖలిస్తానీ మద్దతుదారులకు కెనడా సురక్షితమైన ప్రదేశంగా మారిందని అనేక నివేదికలు సూచించాయి. జూన్ 2023లో కెనడాలో చాలా చోట్ల పర్మార్ పోస్టర్లు వేశారు. అతన్ని హీరోగా చూపించారని అనేక నివేదికలు వెల్లడించాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..