Bathukamma in UK: అక్టోబర్ 10న లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలు.. పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ  కవిత

Batukamma in UK: తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ విదేశాల్లో దసరా పండగ సంబరాలు  షురూ అయ్యాయి. ఈ నేపథ్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ జాగృతి రెడీ..

Bathukamma in UK: అక్టోబర్ 10న లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలు.. పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ  కవిత
Mlc Kavita Batukamma Poster

Updated on: Sep 28, 2021 | 1:30 PM

Bathukamma in UK: తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ విదేశాల్లో దసరా పండగ సంబరాలు  షురూ అయ్యాయి. ఈ నేపథ్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ జాగృతి రెడీ అవుతుంది. తాజాగా తెలంగాణ జాగృతి లండన్ విభాగం ఆధ్వర్యంలో జరిగే మెగా బతుకమ్మ వేడుకల పోస్టర్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి నాయకులను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. తెలంగాణ జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 10 వ తేదీన లండన్ లో మెగా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. బతుకమ్మ వేడుకల్లో యూకే తెలంగాణ జాగృతి ప్రతినిధులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. అక్టోబర్ 10 వ తేదీన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ఆడబిడ్డలకు తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా చేనేత చీరలను అందించనున్నామని తెలంగాణ జాగృతి యూకే విభాగం అధ్యక్షులు సుమన్ బల్మూరి పేర్కొన్నారు.

 

 

Also Read: R.1 COVID Variant: మానవాళిపై పగబట్టిన కోవిడ్.. కొత్తవేరియంట్ గుర్తింపు.. 35 దేశాల్లో 10వేల మంది బాధితులు..

Tumakuru Matt: తుమకూరు మఠానికి 13 ఏళ్ల బాలుడు మఠాధిపతిగా ఎంపిక.. చదువుతూనే బాధ్యతలు నిర్వహిస్తాడన్న పెద్దలు..