France Election 2022: రసవత్తరంగా ఫ్రాన్స్‌ రాజకీయాలు.. అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిన ప్రెసిడెంట్ మెక్రాన్ కూటమి

|

Jun 21, 2022 | 6:50 AM

France Election: ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌ మెక్రాన్‌ పార్టీకి ఎదురు దెబ్బతగిలింది. సెంట్రిక్‌ కూటమికి కనీస మెజారిటీ రాలేదు, లెఫ్ట్‌ ఫ్రంట్‌ పుంజుకున్నా మెజారిటీకి దూరంగా ఉంది.. ప్రభుత్వ ఏర్పాటుపై డైలమా కొనసాగుతోంది..

France Election 2022: రసవత్తరంగా ఫ్రాన్స్‌ రాజకీయాలు.. అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిన ప్రెసిడెంట్ మెక్రాన్ కూటమి
Emmanuel Macron
Follow us on

France Election: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మూన్యుయేల్ మెక్రాన్ ప్రభుత్వానికి ఊహించని షాక్​ తగిలింది. మెక్రాన్‌ సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడంతో ఫ్రాన్స్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటీవల జరిగిన ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మూనుయేల్ మేక్రాన్ రెండోసారి విజయం సాధించి పదవిని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. కానీ తాజాగా జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సెంట్రిక్‌ పార్టీ కూటమికి ఊహించని షాక్‌ ఇచ్చారు ఫ్రెంచ్‌ ప్రజలు. ప్రతిపక్షాలు అనూహ్యంగా పుంజుకున్నాయి. అయితే సోమవారం వెలువడిన ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఫలితాల్లో గందరగోళం కొనసాగుతోంది. ఫ్రాన్స్‌ పార్లమెంట్‌లో మొత్తం 577 స్థానాలు ఉంటే కనీస మెజారిటీ 289 సీట్లు రావాలి. కానీ సెంట్రిక్‌ కూటమికి 245 మాత్రమే వచ్చాయి. మరోవైపు వామపక్ష నేత జీన్ లూక్ మెలెన్‌చోన్ నాయకత్వంలోని న్యూప్‌ కూటమి అనూహ్యంగా పుంజుకుంది. కానీ 131 సీట్లు మాత్రమే వచ్చి మెజారిటీకి చాలా దూరంలో ఉండిపోయింది. ఇక మారీన్ లెపెన్ నాయకత్వంలోని నేషనలిస్ట్ పార్టీ 89 స్థానాలను గెలుచుకుంది.

మేక్రాన్‌ పార్టీ సెంట్రక్‌ కూటమికి పూర్తి మెజారిటీ దక్కకపోయినా ఫలితాల్లో మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో వామపక్ష న్యూప్‌ కూటమి నిలిచింది. ఈ దశలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే నేషనలిస్ట్ పార్టీ మద్దతు కీలకంగా మారింది. న్యూప్‌ కూటమికి నేషనలిస్ట్‌ పార్టీ మద్దతు ఇచ్చినా కనీస మెజారిటీకి దూరంగానే ఉంటుంది. దీంతో నేషనలిస్ట్‌ పార్టీ నేత మారీన్ లె పెన్ ఏ నిర్ణయం తీసుకుంటారనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా ఫ్రాన్స్‌ పార్లమెంటుకు ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సాధించలేని మొట్టమొదటి సిట్టింగ్‌ అధ్యక్షుడిగా మేక్రాన్‌ నిలిచారు.

కాగా.. ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ నేషనల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మెక్రాన్​కూటమికి సీట్లు తగ్గడంపై వామపక్ష నేత మెలెన్‌చోన్ స్పందించారు. ప్రభుత్వాన్ని గద్దె దించాలనుకున్న నెల రోజుల్లోనే అనుకున్నది సాధించామంటూ ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..