Barack Obama Video: ఒబామా‌ను ఇరుకున పెట్టిన వీడియో లీక్.. క్షమాపణ కోరిన అమెరికా సింగర్

Barack Obama: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకుని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ విమర్శలకు కారణం ఏంటంటే..

Barack Obama Video: ఒబామా‌ను ఇరుకున పెట్టిన వీడియో లీక్.. క్షమాపణ కోరిన అమెరికా సింగర్
Obama Birthday Party

Updated on: Aug 14, 2021 | 7:05 PM

Barack Obama: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకుని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ విమర్శలకు కారణం ఏంటంటే.. ఈ నెల 4న బరాక్ ఒబామా తన 60వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన సన్నిహితులు, స్నేహితులకు ప్రత్యేక పార్టీ ఇచ్చారు. ఈ ప్రైవేట్ పార్టీలో అతిథులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఒబామా, ఆయన సతీమణి మిచెల్లీ ఒబామా ఉత్సాహంగా కనిపించారు. అయితే ఈ పార్టీలో ఒబామా ఫేస్ మాస్క్ పెట్టుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాధ్యతారాహిత్యమంటూ వ్యతిరేకులు మండిపడుతున్నారు.

సోషల్ మీడియా వేదికగానూ ఒబామాను ఆయన వ్యతిరేకులు టార్గెట్ చేస్తున్నారు. చిన్న పిల్లలు మాస్కులు ధరించి స్కూల్స్‌లో ఇబ్బందులు పడుతుంటే.. ఒబామా మాస్క్ లేకుండా డ్యాన్సులు వేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

కాగా ఒబామా బర్త్ డే పార్టీకి సంబంధించిన ఈ వీడియోలు, ఫోటోలను అమెరికా సింగర్ ఎరికా బాదు సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కారణంగా ఒబామా తీవ్ర విమర్శలపాలు కావడంతో ఆమె ఒబామాతో పాటు మిచెల్లీకి క్షమాపణ చెప్పారు. ఓ అతిథిగా తాను పెద్ద తప్పు చేశానంటూ ఆవేదన వ్యక్తంచేశారు. తన కారణంగా ఒబామా కుటుంబం ఇబ్బందులు ఎదుర్కోవడం పట్ల తీవ్ర విచారం చెందుతున్నట్లు పేర్కొన్నారు.

అమెరికా సింగర్ ఎరికా బాదు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒబామా బర్త్ డే పార్టీ వీడియో..

ఒబామాకు క్షమాపణ చెబుతూ అమెరికా సింగర్ చేసిన ట్వీట్..

Also Read..

Viral video: నా కారు ఆపుతావా అంటూ పోలీస్ అధికారి మీద నుంచి పోనిచ్చాడో డ్రైవర్.. వైరల్ వీడియో

ఇతగాడికి ఏ అవార్డు ఇద్దాం చెప్పండి..? ఎండ్రకాయతో బెండకాయ కట్ చేయించాడు

Loading...
Unable to load recommendations.
Follow Us