Dubai PM: భరణం కేసులో జాక్‌పాట్‌ కొట్టేసింది.. మాజీ భార్యకు దుబాయ్ ప్రధాన మంత్రి 728 మిలియన్ డాలర్ల భరణం

|

Dec 22, 2021 | 7:16 AM

Dubai PM: విడాకులు కూడా మంచికే. చాలామంది మగవారు మనఃశాంతి కోసం.. కొందరు ఆడవారు భరణం కోసం ఈ ట్రిక్‌ను వాడుతుంటారు. దుబాయ్‌ పాలకుడి మాజీ భార్య....

Dubai PM: భరణం కేసులో జాక్‌పాట్‌ కొట్టేసింది.. మాజీ భార్యకు దుబాయ్ ప్రధాన మంత్రి 728 మిలియన్ డాలర్ల భరణం
Follow us on

Dubai PM: విడాకులు కూడా మంచికే. చాలామంది మగవారు మనఃశాంతి కోసం.. కొందరు ఆడవారు భరణం కోసం ఈ ట్రిక్‌ను వాడుతుంటారు. దుబాయ్‌ పాలకుడి మాజీ భార్య.. ఈ భరణం కేసులో జాక్‌పాట్‌ కొట్టేసింది. అప్పుడెప్పుడో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ భార్యకు విడాకులిచ్చి.. 38 బిలియన్‌ డాలర్ల విలువైన అమెజాన్‌ షేర్లను కూడా భరణం కింద ఇచ్చేశాడు. చరిత్రలో ఇదే అతిపెద్ద భరణం కేసు. ఇప్పుడు అంత కాకపోయినా.. అదే రేంజ్‌లో ఓ సెటిల్మెంట్‌ జరిగింది. దుబాయ్ పాలకుడు, ప్రధాన మంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్ పై ఆయన మాజీ భార్య యువరాణి హయా బింట్ అల్-హుస్సేన్‌ భరణం కేసు గెలిచింది. అల్‌-మక్తూమ్‌ 728 మిలియన్‌ డాలర్ల భరణం అంటే.. 5500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందేనని లండన్‌ హైకోర్టు తీర్పునిచ్చింది.

జూన్ 2019లో షేక్ అల్-మక్తూమ్ ఆరవ భార్య ప్రిన్సెస్ హయా బింట్ అల్ హుస్సేన్ తన పిల్లలతో సహా జర్మనీకి పారిపోయింది. ఆతర్వాత విడాకులకు అప్లై చేసింది. దుబాయ్ పాలకుడు అల్-మక్తూమ్ తన పిల్లల్లను ఇ‍వ్వమంటూ జర్మనీకి చేసిన అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో దౌత్యపరమైన సమస్యలు తలెత్తాయి. ఈ మేరకు ఆమె తన భద్రత, స్వేచ్ఛ కోసం యూకే కోర్టును ఆశ్రయించింది.

ఈ క్రమంలో యూకే కోర్టు మాజీ భార్య భద్రతకు, వారి ఇద్దరు పిల్లలు అల్ జలీలా బిన్త్ మహ్మద్ బిన్ రషీద్, షేక్ జాయెద్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్‌ల భద్రతకు అయ్యే ఖర్చుని ఇవ్వాల్సిందేగా దుబాయ్‌ పాలకుడు అల్-మక్తూమ్‌ని ఆదేశించింది. అంతేకాదు 2వేల516 కోట్ల రూపాయలు ముందుస్తుగా చెల్లించాలని ఆదేశించింది. ఆ తదుపరి మొత్తాన్ని మూడు నెలల్లో సెటల్‌మెంట్‌ చేయాల్సిందిగా తీర్పునిచ్చింది. పైగా తదుపరి కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు ఇద్దరు పిల్లలకు వారి జీవితాంతం భద్రతా ఖర్చులను భరించాలి అని కూడా స్పష్టం చేసింది. అల్-మక్తూమ్ మాజీ భార్య ప్రిన్సెస్‌ హయా బింట్ జోర్డాన్ మాజీ పాలకుడు కింగ్ హుస్సేన్ కుమార్తె, పైగా ప్రస్తుత పాలకుడు కింగ్ అబ్దుల్లా సోదరి కావడంతో.. కేసు రసవత్తరంగా మారింది.

ఇవి కూడా చదవండి:

Omicron విధ్వంసం.. క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ పార్టీలు రద్దు..! పెద్దల కంటే పిల్లలకు ప్రాణాంతకం..

UK News: బ్రిటన్‌లో క్రిస్మస్‌పై ఆంక్షలు ఉండవు..! పీఎం బోరిస్ జాన్సన్ ఏం చెప్పాడంటే..?