Coronavirus: కరోనా విషయంలో అమెరికా కీలక నిర్ణయం.. వారికి కోవిడ్‌ టెస్ట్‌లు తప్పనిసరి

|

Jan 02, 2023 | 5:44 AM

గత మూడేళ్ల కింద కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేసింది. కరోనా కట్టడికి చేపట్టిన చర్యల వల్ల ప్రస్తుతం అదుపులో ఉంది. అయితే ఇప్పుడు ఫోర్ట్‌ వేవ్‌ గురించి టెన్షన్‌ పట్టుకుంది. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో..

Coronavirus: కరోనా విషయంలో అమెరికా కీలక నిర్ణయం.. వారికి కోవిడ్‌ టెస్ట్‌లు తప్పనిసరి
Coronavirus
Follow us on

గత మూడేళ్ల కింద కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేసింది. కరోనా కట్టడికి చేపట్టిన చర్యల వల్ల ప్రస్తుతం అదుపులో ఉంది. అయితే ఇప్పుడు ఫోర్ట్‌ వేవ్‌ గురించి టెన్షన్‌ పట్టుకుంది. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో మళ్లీ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. మళ్లీ భారత్‌తో సహా అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. అయితే ప్రస్తుతం చైనా సర్కారు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. అక్కడ రోజుకు లక్షకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయని, రోజుకు 9 వేల మంది చొప్పున కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక అమెరికాను సైతం కరోనా తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా కరోనా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, హాంకాంగ్‌, మకావు దేశాల నుంచి అమెరికాకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టును తప్పనిసరి చేసింది. కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టుతో వచ్చిన వారినే తమ దేశంలోకి అనుమతిస్తామని పేర్కొన్నది. ఈ నెల 5 నుంచి ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

ఈ మేరకు అమెరికాకు చెందిన సీడీసీ (సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌) ఆదివారం ఒక ప్రకటన చేసింది. గత బుధవారం చైనా నుంచి ఇటలీకి వెళ్లిన రెండు విమానాల్లోని ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో సగం మందికిపైగా కోవిడ్‌ ఉన్నట్లు తేలింది. దీంతో అమెరికా మరింతగా అప్రమత్తం అయింది. ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి