Covid-19 variant KP.3: కలవర పెడుతున్న కోవిడ్ KP.3 కొత్త వేరియంట్.. భారత్‌కు వ్యాపించేనా..?

|

Jul 20, 2024 | 2:59 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పీడ ఇంకా పోలేదు. కొవిడ్​ మహమ్మారి మరో కొత్త రూపు దాల్చింది. తాజాగా కేపీ.3 అనే కొత్త వేరియంట్‌ వెలుగులోకి రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

Covid-19 variant KP.3: కలవర పెడుతున్న కోవిడ్ KP.3 కొత్త వేరియంట్.. భారత్‌కు వ్యాపించేనా..?
Coivd Kp 3 Variant
Follow us on

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పీడ ఇంకా పోలేదు. కొవిడ్​ మహమ్మారి మరో కొత్త రూపు దాల్చింది. తాజాగా కేపీ.3 అనే కొత్త వేరియంట్‌ వెలుగులోకి రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కోవిడ్ KP.3 కొత్త వేరియంట్ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. గత కొన్ని వారాలుగా ఈ వేరియంట్‌తో సంక్రమణ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

జపాన్‌లో ఈ వేరియంట్‌ వేగంగా సంక్రమణ కేసులు పెరిగుతున్నాయి.జపాన్‌లో కోవిడ్ 11 వ వేవ్ ప్రమాదం పొంచి ఉంది. గత నెలలో జపాన్‌ తోపాటు అమెరికాలో కూడా కరోనా వేరియంట్ FLiRT కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో కరోనా నియంత్రణలో ఉంది. అయితే జపాన్, అమెరికా కోవిడ్ రకాలు భారతదేశంలో వ్యాప్తి చెందుతుందా అన్న ప్రశ్న తలెత్తోంది. ప్రజలకు సోకే ఈ కొత్త వేరియంట్ KP.3 అంటువ్యాధి. ఈ వేరియంట్ కోవిడ్ వ్యాక్సిన్ పొందిన వారికి కూడా సోకుతోంది. KP వేరియంట్ 3 లక్షణాలు మునుపటి వేరియంట్‌ల మాదిరిగానే ఉంటాయి. వీటిలో అధిక జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, విపరీతమైన అలసట, వాసన, రుచి కోల్పోవడం వంటివి ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఈ వేరియంట్ గురించి పెద్దగా ఏమీ చెప్పలేమంటున్నారు వైద్య నిపుణులు.

అటు కేపీ.3 వేరియంట్ అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. టీకాలు తీసుకున్న లేదా గతంలో ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న వారికి కూడా ఇప్పుడు ఈ ​కొత్త వేరియంట్‌ సోకుతోంది. ఈ వైరస్ పరివర్తన చెందిన ప్రతిసారీ మరింత ప్రమాదకరంగా మారుతోంది. కరోనా నూతన వేరియంట్‌ వ్యాప్తి విషయంలో రాబోయే వారాలు చాలా కీలకం. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కొవిడ్‌ బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు. అమెరికా జూలై 1 నుంచి 7వ తేదీ వరకు వివిధ ఆసుపత్రులలో రోజుకు సగటున 30 ఇన్ఫెక్షన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య సదుపాయాలు, పడకల కొరత విషయంలో ఆందోళన తలెత్తుతోంది.

తాజాగా జో బైడెన్ కూడా కరోనా బారిన పడ్డారు.. ఆయనలో ఈ కరోనా కేపీ.3 వేరియంట్ లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. కరోనా కేపీ.3 వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. వేరియంట్‌ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు

మొదట్లో కోవిడ్ చైనాలోని వుహాన్‌లో మొదలై క్రమంగా ప్రపంచమంతటా వ్యాపించింది. ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి చాలావరకు నియంత్రణలో ఉన్నప్పటికీ, కొత్త వేరియంట్‌ల వల్ల కరోనా వేవ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా లేనప్పటికీ, జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. దేశంలో ఈ వేరియంట్ కేసులు కనిపిస్తే, వాటిని సకాలంలో నియంత్రించాల్సి ఉంటుంది. దీనితో, ఈ వేరియంట్ కనీస సంఖ్యలో వ్యక్తులకు సోకుతుంది. కోవిడ్ కొత్త రకాలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. భవిష్యత్తులో కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. దీన్ని నివారించడం చాలా ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..