AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం ఒక కప్పు పెరుగుతో డయాబెటిస్ కు చెక్… చైనా శాస్త్రవేత్తల సంచలన ఆవిష్కరణ!

రోజువారీ ఇంజెక్షన్లు, మాత్రల బాధ నుంచి డయాబెటిస్ రోగులకు త్వరలోనే విముక్తి లభించనుంది. కేవలం ఒక కప్పు పెరుగు తాగడం ద్వారా డయాబెటిస్‌ను పూర్తిగా అదుపులో ఉంచుకునే పెరుగు తరహాలో ఉండే "స్మార్ట్' ప్రోబయోటిక్ ను కనిపెట్టారు చైనా పరిశోధకులు .

కేవలం ఒక కప్పు పెరుగుతో డయాబెటిస్ కు చెక్... చైనా శాస్త్రవేత్తల సంచలన ఆవిష్కరణ!
Chinese Researches Create Smart Bacterium
Sharada V
|

Updated on: Aug 25, 2026 | 11:41 AM

Share

ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య ఏకంగా 85 కోట్ల మార్కును దాటిపోతుందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలకే ముప్పు తెచ్చే ఈ వ్యాధితో పోరాడేందుకు రోగులు నిత్యం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ బిళ్లలు వేసుకోవడం, వేళకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవడం వారి జీవితంలో ఒక యంత్రంలా మారిపోయింది. ఈ నరకయాతనను తప్పించేందుకు చైనా శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక అడుగు ముందుకు వేశారు.

గిఫ్ట్’ స్మార్ట్ ప్రోబయోటిక్

ఈస్ట్ చైనా నార్మల్ యూనివర్సిటీ పరిశోధకులు  ‘గిఫ్ట్’ అనే పేరుతో జన్యుపరంగా మార్పు చేసిన ‘స్మార్ట్’ ప్రోబయోటిక్‌ను అభివృద్ధి చేశారు. ఈ బ్యాక్టీరియా ఒక రహస్య గూఢచారిలా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర  స్థాయిలు సాధారణంగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా పూర్తిగా నిస్తేజంగా ఉంటుంది.  కానీ,  ఎప్పుడైతే రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతాయో… వెంటనే  అప్రమత్తమై ‘స్మార్ట్’ బ్యాక్టీరియా మేల్కొంటుంది!

తక్షణమే గ్లూకోజ్‌ను తగ్గించే GLP-1 (గ్లూకోగాన్-లైక్ పెప్టైడ్-1) అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న ‘ఓజెంపిక్’ తరహాలో ఇది పనిచేస్తుంది. పరిశోధనకు సంబంధించిన వివరాలు  ‘నేచర్’ సైన్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. కోతులు, ఎలుకలపై నిర్వహించిన పరీక్షల్లో ఈ స్మార్ట్ ప్రోబయోటిక్ అద్భుత ఫలితాలను ఇచ్చింది.

గతాన్ని మార్చిన ప్రయాణం… వెలుగు చూసిన సరికొత్త ఆవిష్కరణ

2011లో స్విట్జర్లాండ్‌ నుంచి చైనాకు తిరిగి వచ్చినప్పటి నుంచి శాస్త్రవేత్త యే హైఫెంగ్ కేవలం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్నారు. రోగులకు ఇన్సులిన్ ఇంజెక్షన్ల  బాధ లేకుండా చేయాలని తపించారు.

అప్పట్లో ఆయన తను సృష్టించిన జన్యు మార్పిడి క్షీరద కణాలను ఎలుకలలో ప్రవేశపెట్టి, వాటిపై నీలం రంగు కాంతిని  ప్రసరింపచేయడం ద్వారా GLP-1 హార్మోన్‌ను విడుదల చేయించగలిగారు. ఈ అద్భుత ప్రయోగం అప్పట్లో ‘సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమై సంచలనం సృష్టించింది. అయితే, ఆ పాత పద్ధతిలో ఒక పెద్ద సమస్య ఉండేది. ఆ ప్రక్రియను ప్రారంభించడానికి బాహ్యంగా నీలం రంగు కాంతి వంటి సిగ్నల్స్ అవసరం అయ్యేవి. కానీ ఇప్పుడు కనిపెట్టిన ‘గిఫ్ట్’ ప్రోబయోటిక్‌కు ఎలాంటి బాహ్య సహాయం అవసరం లేదు. శరీరం లోపలి పరిస్థితులకే అదే స్వయంగా స్పందిస్తుంది!

రెండేళ్లలో అమెరికా మార్కెట్లోకి విప్లవాత్మక మందు!

ప్రస్తుతం ఈ చైనీస్ రీసెర్చ్ టీమ్ దీనికి సంబంధించిన పేటెంట్ కు దరఖాస్తు చేసుకుంది. అమెరికా, యూరప్ దేశాల ఫార్మాస్యూటికల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తిని భారీ ఎత్తున పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. “రాబోయే రెండేళ్లలో ఈ ప్రోబయోటిక్ అమెరికా మార్కెట్లో ఒక హెల్త్ సప్లిమెంట్ రూపంలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది,” లీడ్ సైంటిస్ట్ యే హైఫెంగ్ ‘చైనా సైన్స్ డైలీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ గనుక తుది దశలోనూ పూర్తిగా విజయం సాధిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మధుమేహ రోగులకు ఉపశమనం లభించినట్లే !

Follow Us