Canada Emergency: కెనడాలో ఉద్రిక్త పరిస్థితులు.. 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం..

|

Feb 17, 2022 | 6:30 AM

Canada Emergency: కెనడాలో 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీ విధించారు. అసలు కెనడాలో ఏం జరుగుతోంది? ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితులు ఎందుకు తలెత్తాయో ఇప్పుడు చూద్దాం..

Canada Emergency: కెనడాలో ఉద్రిక్త పరిస్థితులు.. 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం..
Canada Emergency
Follow us on

Canada Emergency: కెనడాలో 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీ విధించారు. అసలు కెనడాలో ఏం జరుగుతోంది? ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితులు ఎందుకు తలెత్తాయో ఇప్పుడు చూద్దాం.. మన దేశంలో కొవిడ్‌ వ్యాక్సిన్ల (Covid-19 Vaccine) కోసం జనం బారులు తీరిన ఘటనలు ఎన్నో చూశాం. కానీ, అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఆ దేశాల్లో కరోనా అల్లకల్లోలం సృష్టించినా, వ్యాక్సిన్‌ వేసుకునేందుకు విముఖత చూపుతున్నారు పౌరులు. అంతేనా, టీకాలు తప్పనిసరి చేయడంతో భారీ సంఖ్యలో రోడ్డెక్కుతున్నారు ప్రజలు. ఈ విచిత్ర పరిస్థితి కెనడాలో నెలకొంది. కెనడా (Canada) లో అల్లకల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి చేయడాన్ని, కొవిడ్ నిబంధనలను వ్యతిరేకిస్తూ అక్కడి ట్రక్కు డ్రైవర్లు చేపట్టిన ఫ్రీడమ్ కాన్వాయ్ నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో 50 ఏళ్లలో తొలిసారి దేశంలో ఎమర్జెన్సీ విధించింది ట్రూడో ప్రభుత్వం. కొవిడ్ వ్యాక్సిన్, ఇతర నిబంధనలను వ్యతిరేకిస్తూ కెనడా ట్రక్కు డ్రైవర్లు ఫ్రీడమ్ కాన్వాయ్ పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వేలాది ట్రక్కులతో దేశ రాజధాని ఒటావాలోకి ప్రవేశించి, రోజుల తరబడి రోడ్లను దిగ్బంధించారు డ్రైవర్లు. గడిచిన రెండు వారాలుగా కెనడాలోని పలు నగరాలు దాదాపు స్తంభించిపోయాయి.

అమెరికా సహా ఇతర దేశాలకు సరుకులు రవాణా చేసే ట్రక్కు డ్రైవర్లు అందరూ, తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్లు తీసుకోవాలన్న నిబంధనలు కెనడాలో ఈ కల్లోలానికి దారితీశాయి. కొవిడ్ నిబంధనలతో ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను హరిస్తోందంటూ నిరసనలు ఎగసిపడ్డాయి. ఇప్పుడవి పెనుమంటల్లా వ్యాపించి, ఎమర్జెన్సీకి దారితీశాయి. నిరసనలను విరమించాలని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పదే పదే విజ్ఞప్తి చేసినా డ్రైవర్లు మాత్రం వినలేదు. దీంతో ఒట్టావాలో పరిస్థితులు అదుపు తప్పాయి. పోలీసులు కూడా చేతులెత్తేశారు. దీంతో చేసేదేం లేక ఎమర్జెన్సీ అస్త్రాన్ని ప్రయోగించారు ప్రధాని ట్రూడో. దీనిపై కెనడా ప్రజలు భగ్గుమంటున్నారు. ఆందోళనలు విరమించేది లేదంటూ స్పష్టంచేస్తున్నారు.

Also Read: Trending: యంగెస్ట్ ఎమ్మెల్యేతో ఏడడుగులు వేయనున్న యంగెస్ట్ మేయర్..

Bappi Lahiri: ఆ పాత మధురం రష్యా గాయకుడి నోట.. బప్పీలహరి పాట.. వీడియో వైరల్..