Trending: యంగెస్ట్ ఎమ్మెల్యేతో ఏడడుగులు వేయనున్న యంగెస్ట్ మేయర్..

చిన్న వయసులోనే మేయర్‌ పీఠాన్ని అధిరోహించారామె. అసెంబ్లీలో అతి తక్కువ వయసున్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారాయన. వీరిద్దరూ ఇప్పుడు ఒక్కటయ్యేందకు సిద్ధమయ్యారు. ఇంతకీ, ఎవరు వారు, ఏంటీ వారి కథ.

Trending: యంగెస్ట్ ఎమ్మెల్యేతో ఏడడుగులు వేయనున్న యంగెస్ట్ మేయర్..
Arya Rajendran Wedding
Follow us

|

Updated on: Feb 16, 2022 | 9:38 PM

Kerala: కేరళలో అతి చిన్న వయస్సులోనే మేయర్‌గా, ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టి.. అందరి దృష్టిని ఆకర్షించిన వారిద్దరూ వివాహబందంతో ఒక్కటి అవ్వబోతున్నారు. తిరువనంతపురం(Tiruvanathapuram )మేయర్ ఆర్య రాజేంద్రన్.. బలుస్సేరి ఎమ్మెల్యే సచిన్ దేవ్‌లు దాంపత్య జీవితంలోకి అడగుపెట్టనున్నారు . ఈ ఇద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇరు కుటుంబాల నుంచి అంగీకారం లభించింది. సచిన్ దేవ్‌, ఆర్య రాజేంద్రన్ టీనేజ్ నుంచి ఎస్‌ఎఫ్‌ఐ‌(Sfi)లో వర్క్ చేశారు. అప్పటి నుంచే వారిద్దరూ మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. ఈ క్రమంలోనే ఆ బంధాన్ని మరో మెట్టు ఎక్కిస్తూ పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి పెళ్లి తేదీని త్వరలోనే చెబుతామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్య రాజేంద్రన్ అతి తక్కువ వయస్సులోనే( 21 ) మేయర్ పదవి చేపట్టిన వ్యక్తిగా రికార్డ్  క్రియేట్ చేశారు. చదువు కొనసాగుతుండగానే, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ, సీపీఐ (ఎం)లో ఏరియా కమిటీ సభ్యురాలుగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు సచిన్ దేవ్. 15వ కేరళ అసెంబ్లీలో ఇతనే తక్కువ వయస్సు ఉన్న మెంబర్. కోజికోడ్‌లోని గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి ఇంగ్లీష్‌లో డిగ్రీ, కోజికోడ్‌లోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్‌బీ చేశారాయన. సచిన్ దేవ్ ఎస్‌ఎఫ్‌ఐలో కీలక పదవుల్లో పనిచేశారు. వీరిద్దరి పెళ్లి ముచ్చట ఇప్పుడు యావత్‌ భారతావని దృష్టిని ఆకర్షిస్తోంది. అటు ఆర్య రాజేంద్రన్, సచిన్‌దేవ్‌ల గురించి రకరకాల స్టోరీలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

Also Read: కారంపొడి, పచ్చి మిర్చి రెండింటిలో ఏది బెటర్.. ఈ విషయాలు మీరు అస్సలు నమ్మలేరు

Viral Photo: అపరంజి బొమ్మ.. అందాల జాబిల్లి.. అప్పట్లో తెలుగునాట సెన్సేషన్.. ఎవరో గుర్తించారా..?

కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం..ఎగబడ్డ జనం
కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం..ఎగబడ్డ జనం
237 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో చోటు?
237 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో చోటు?
వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే
వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే
జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం అస్సలు కలపొద్దు
జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం అస్సలు కలపొద్దు
బీజేపీ అభ్యర్థి ఖరారు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో త్రిముఖ పోటీ
బీజేపీ అభ్యర్థి ఖరారు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో త్రిముఖ పోటీ
డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టనున్న స్టార్ హీరోలు..
డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టనున్న స్టార్ హీరోలు..
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల