Joe Biden: ‘బైడెన్‌.. మళ్లీ మళ్లీ తడబడుచుండేన్‌..’ తలలు పట్టుకుంటున్న డెమోక్రాట్లు! ఇదీ ఆ భయమేనా?

|

Jul 15, 2024 | 12:33 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయాలు వాడీవేడీగా మారుతున్నాయి. చూడబోతే.. అధికారంలో ఉన్న డెమోక్రాట్లలో నానాటికీ టెన్షన్‌ పెరిగిపోతోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రసంగాల్లో తడబాట్లతో నవ్వులపాలైపోతున్నారు. తాజాగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బైడెన్‌ జాతిని ఉద్దేశించి ఆదివారం వైట్‌హౌస్‌లో..

Joe Biden: బైడెన్‌.. మళ్లీ మళ్లీ తడబడుచుండేన్‌.. తలలు పట్టుకుంటున్న డెమోక్రాట్లు! ఇదీ ఆ భయమేనా?
Joe Biden
Follow us on

వాషింగ్టన్‌, జులై 15: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయాలు వాడీవేడీగా మారుతున్నాయి. చూడబోతే.. అధికారంలో ఉన్న డెమోక్రాట్లలో నానాటికీ టెన్షన్‌ పెరిగిపోతోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రసంగాల్లో తడబాట్లతో నవ్వులపాలైపోతున్నారు. తాజాగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బైడెన్‌ జాతిని ఉద్దేశించి ఆదివారం వైట్‌హౌస్‌లో ప్రసంగించారు. ఈ ప్రసంగంలో కూడా బైడెన్‌ మాటల్లో తప్పులు దొర్లాలి. బైడెన్‌ ఇలా మాట్లాడారు.. ‘ప్రజాస్వామ్యం కోసం గట్టిగా గలం వినిపిస్తాను. రాజ్యాంగం, చట్ట నియమాల కోసం నిలబడతాను. విభేదాలపై మేం చర్చించాం. అమెరికాలో మా విభేదాల పరిష్కారానికి బ్యాటిల్‌ బాక్సును నమ్ముతాం. ఇప్పుడు కూడా మేం వాటిని బ్యాటిల్‌ బాక్సుల్లోనే పరిష్కరించుకొంటాం.. బుల్లెట్లతో కాదు’ అని చెప్పడంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకొన్నారు. తమ విబేధాలను బ్యాలెట్‌ బాక్సుల్లో పరిష్కరించుకొంటాం’ అని చెప్పాల్సి ఉండగా.. ‘బ్యాటిల్‌ బాక్సుల్లో’ (యుద్ధ పెట్టెల్లో) పరిష్కరించుకొంటామని తప్పుగా పలికారు.

మునుపటి ప్రసంగంలో ట్రంప్‌పై జరిగిన దాడి గురించి మాట్లాడుతూ.. దీనిపై మనందరం ఒక అడుగు వెనక్కి తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ హింసను సాధారణీకరించడాన్ని మేము అనుమతించలేం. దేశంలో పొలిటికల్‌ వార్‌ చాలా వేడెక్కింది. దీనిని చల్లార్చడానికి ఇదే సమయం’ అని ఆయన అన్నారు. ఇక్కడ ‘దీన్ని చల్లార్చవలసిన బాధ్యత మనందరిపై ఉంది’ అని పలకాలి. అలాగే హత్యాయత్నానికి కొద్ది గంటల ముందు, బిడెన్ ప్రచారంలో ట్రంప్‌ను ‘నియంత’గా పేర్కొన్నాడు. అంతకుముందు పలు సందర్భాల్లో ట్రంప్‌ను ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన ముప్పుగా బిడెన్ అభివర్ణించారు. రిపబ్లికన్లు ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించారని ఆయన అన్నారు.

నాటో కూటమి దేశాల వార్షిక సదస్సు ముగింపు అనంతరం మీడియా ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. అధ్యక్ష రేసు నుంచి మీరు వైదొలగితే ట్రంప్‌ను కమలా హ్యారిస్‌ ఓడించగలరని భావిస్తున్నారా? అని ఒకరు ఆయనను ప్రశ్నించగా సమాధానమిస్తూ.. ‘అధ్యక్షుడిగా పనిచేసే అర్హతలు ఉపాధ్యక్షుడు ట్రంప్‌నకు లేకుంటే నేను అసలు ఆయన్ని ఆ పదవికి ఎంపిక చేసేవాణ్నే కాదని బదులిచ్చారు. ఇక్కడ పొరపాటున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ అనాడానికి బదులు ట్రంప్‌ అనేశారు. మరో సందర్భంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి బదులు.. ‘అధ్యక్షుడు పుతిన్‌’ అని సంబోధించారు. దీంతో వార్షిక సదస్సులోని వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఇవి కూడా చదవండి

కాగా పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ తుపాకీ కాల్పులు జరపగా.. ఆయన గాయపడ్డారు. ట్రంప్ ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో తుపాకీ కాల్పులు జరిగాయి. వెంటనే ట్రంప్‌ను బయటకు తీసుకొచ్చి సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లిన సీక్రెట్ సర్వీస్, ఆయన క్షేమంగా ఉన్నారని మీడియాకు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.