US: ఆ దేశ చరిత్రలో ఆయనే అతి పెద్ద వయస్కుడైన ప్రెసిడెంట్.. 80వ అంకంలోకి బైడెన్..

|

Nov 21, 2022 | 12:06 PM

ప్రపంచ దేశాలలో పేరున్న నాయకుడు, అగ్రరాజ్య అధినేత జో బైడెన్ తన 80వ ఏటలోకి అడుగులు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి..

US: ఆ దేశ చరిత్రలో ఆయనే అతి పెద్ద వయస్కుడైన ప్రెసిడెంట్.. 80వ అంకంలోకి బైడెన్..
Joe Biden And Jill Biden
Follow us on

ప్రపంచ దేశాలలో పేరున్న నాయకుడు, అగ్రరాజ్య అధినేత జో బైడెన్ తన 80వ ఏటలోకి అడుగులు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తన జన్మదినోత్సవాలను జరుపుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలను అమెరికా ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడన్ అదివారం తన 80వ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. అమెరికా చరిత్రలో అతి పెద్ద వయస్కుడైన అధ్యక్షుడిగా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా వైట్ హౌస్‌లోని తన కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో కలిసి విందును ఏర్పాటు చేసుకున్నారు. ఆ విందులో బైడెన్‌ తనకెంతో ఇష్టమైన కొబ్బరి కేక్‌ కట్ చేశారు.

ఇవి కూడా చదవండి


అనంతరం.. జో బైడెన్ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్, అధ్యక్షుడితో కలిసి నృత్యం చేస్తున్న రెండు ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “నా కంటే ఎక్కువగా.. మీతో డ్యాన్స్ చేయడానికి ఇష్టపడేవారు మరొకరు లేరు. హ్యాపీ బర్త్ డే జో! నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అంటూ  ఆమె ట్వీట్ క్యాప్షన్ రాసుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..