Bangladesh: సోషల్ మీడియాలోని పోస్టు పై ఆగ్రహించి.. హిందువు ఇంటిపై గుడిపై దాడి చేసిన ఆందోళన కారులు..

|

Jul 17, 2022 | 2:26 PM

ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొందరు ఆందోళన కారులు.. హిందువుల ఇళ్ళకు నిప్పు పెట్టడం..  హిందువులు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు.

Bangladesh: సోషల్ మీడియాలోని పోస్టు పై ఆగ్రహించి.. హిందువు ఇంటిపై గుడిపై దాడి చేసిన ఆందోళన కారులు..
Bangladesh.
Follow us on

Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ హిందువులపై దాడి జరిగింది. ఫేస్‌బుక్ పోస్ట్‌పై ఆగ్రహించినకొందరు ముస్లింలు శుక్రవారం మైనారిటీ హిందువుల ఇళ్లపై దాడి చేశారు. కొందరు వ్యక్తులు గుంపుగా ఏర్పడి..  ఒక హిందువు ఇంటికి కూడా నిప్పు పెట్టారు. అంతేకాదు గుడిపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటన నరైల్‌లోని లోహగ్రా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ గుంపును చెదరగొట్టడం కోసం పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. వివరాల్లోకి వెళ్తే..

డిగోలియా గ్రామానికి చెందిన ఆకాష్ సాహా అనే వ్యక్తి.. ప్రవక్త మహ్మద్ గురించి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టాడని పోలీసులు చెబుతున్నారు. ఈ పోస్టు గురించి సమాచారం స్థానిక ఛాందసవాదులకు తెలియడంతో.. వారు ఆగ్రహించి ఆకాష్ ఇంటిపై దాడి చేశారు. ఇంటికి నిప్పు పెట్టారు. సమీపంలోకి గుడిపైకి రాళ్లు రువ్వారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. ఆందోళనకారులను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడం కోసం గాలిలో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.

వీడియో చూడండి:

ఇవి కూడా చదవండి

ఈ ఘటన అనంతరం పోలీసులు ఆకాష్‌తో పాటు అతని తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన నిందితులను అరెస్టు చేశారు. విచారణ అనంతరం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొందరు ఆందోళన కారులు.. హిందువుల ఇళ్ళకు నిప్పు పెట్టడం..  హిందువులు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. ఈ దాడి తర్వాత ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. నూపుర్ శర్మకు మద్దతుగా ఫేస్‌బుక్ పోస్ట్ చేసిన విద్యార్థికి మద్దతు ఇవ్వడంతో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..