San Antonio: అమెరికాలోని టెక్సాస్‌లో విషాదం.. మెక్సికో నుంచి ట్రక్కులో వెళ్తున్న 46 మంది మృతి..

|

Jun 28, 2022 | 9:32 AM

శాన్​ఆంటోనియోలో ఓ ట్రక్కులో 46 మృతదేహాలను గుర్తించామని లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి తెలిపారు. రైలు పట్టాల పక్కనే ఓ ట్రక్కు నిలిపివేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

San Antonio: అమెరికాలోని టెక్సాస్‌లో విషాదం.. మెక్సికో నుంచి ట్రక్కులో వెళ్తున్న 46 మంది మృతి..
San Antonio Accident
Follow us on

40 migrants found dead: మెక్సికో – టెక్సాస్‌ సరిహద్దులో పదుల సంఖ్యలో మృతదేహాలు లభ్యమవడం కలకలం రేపుతోంది. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో ట్రక్కులో వెళ్తున్న దాదాపు 46 మంది మృతిచెందారు. శాన్​ఆంటోనియోలో ఓ ట్రక్కులో 46 మృతదేహాలను గుర్తించామని లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి తెలిపారు. రైలు పట్టాల పక్కనే ఓ ట్రక్కు నిలిపివేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వీరంతా అమెరికాలోని దక్షిణ టెక్సాస్ (Texas) ​కు అక్రమంగా వలస వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అధికారులు ట్రక్కును తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. ట్రక్కులో ఉన్న మరో 16 మందిని అధికారులు శాన్ ఆంటోనియాలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురు చిన్నారుల ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. సోమవారం జరిగిన ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోని పోలీసులు విచారిస్తున్నారు.

ట్రక్కులోని వారు ఎలా మృతిచెందారనే విషయంపై దర్యాప్తు చేపడుతున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మెక్సికన్ సరిహద్దు నుండి 250 కిలో మీటర్ల దూరంలోని శాన్ ఆంటోనియోలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక తేమతో 39.4 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్‌ పెరిగింది. దీంతో, వలసదారులు ట్రక్కులో మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

మెక్సికో నుంచి అమెరికాకు అక్రమ వలసదారులు ఎక్కువ సంఖ్యలో ట్రక్కుల్లో వెళ్తుంటారు. అంతకుముందు కూడా వలసదారులతో వెళ్తున్న మెక్సికోకు చెందిన ట్రక్కులు ప్రమాదానికి గురి కావడంతో పదుల సంఖ్యలో మెక్సికన్లు మృతిచెందారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..