AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రైనింగ్ ముగింపు వేడుకలో ఒంటరిగా సైనికుడు! కమాండర్ చర్యకు నెటిజన్లు ఫిదా

సైనిక శిక్షణ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే రోజు ప్రతి ఒక్కరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు వచ్చి అభినందించడం ఆ క్షణాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తుంది. కానీ ఇండోనేషియాలో జరిగిన ఒక ఆర్మీ గ్రాడ్యుయేషన్ వేడుకలో ఒక యువ సైనికుడు ఒంటరిగా నిలబడటం చూసి కమాండర్ ఏం చేసారంటే...

ట్రైనింగ్ ముగింపు వేడుకలో ఒంటరిగా సైనికుడు! కమాండర్ చర్యకు నెటిజన్లు ఫిదా
Indonesian Army Recruit Breaks Down As Commander Hugs Him
Sharada V
|

Updated on: Aug 24, 2026 | 7:10 PM

Share

ఇండోనేషియా ఆర్మీలో ఫస్ట్ టీఎన్‌ఐ ఏడీ శిక్షణ ముగింపు వేడుక ఇటీవల వైభవంగా జరిగింది. ఆ కార్యక్రమంలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సైనికులందరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతూ కనిపించారు.

అయితే, ఆ సైనికుల మధ్యలో ఒక యువ రిక్రూట్  మాత్రం ఒంటరిగా నిలబడ్డాడు. అతన్ని  పలకరించడానికి ఎవరూ రాలేదు. తన చుట్టూ ఉన్న తోటి సైనికులు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతుంటే, ఆ యువకుడు మాత్రం ఒంటరిగా నిలబడి ఆ దృశ్యాలను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. కుటుంబానికి దూరంగా ఉండటంతో అతని మనసు తీవ్రంగా వేదనకు గురైంది.

కమాండర్ ఆత్మీయ ఆలింగనం

అది గమనించిన ఆర్మీ కమాండర్ వెంటనే ఆ యువ సైనికుడు ఉన్న చోటుకి వెళ్లారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా, ఎంతో ప్రేమతో ఆ సైనికుడిని దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకున్నారు. కమాండర్ చూపిన ఆ ఆత్మీయతను ఆ యువ సైనికుడు అసలు ఊహించలేకపోయాడు. ఒక్కసారిగా అతని భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. కమాండర్ భుజాలపై తలపెట్టి చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చాడు. ఆ సమయంలో కమాండర్ అతన్ని ప్రేమగా ఓదారుస్తూ సరదాగా నవ్విస్తూ ధైర్యం చెప్పారు. ఈ హృదయవిదారక ఘటన అక్కడ ఉన్న వారిని భావోద్వేగానికి గురిచేసింది.

వైరల్ అయిన వీడియో.. నెటిజన్ల ప్రశంసలు

ఈ భావోద్వేగ వీడియో  సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కుటుంబ సభ్యులు రాలేదన్న బాధలో ఉన్న ఆ సైనికుడి ఒంటరితనాన్ని కమాండర్ గుర్తించి ఇచ్చిన హగ్ అతనికి ఎంతో సాంత్వన ఇచ్చిందని క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.

కమాండర్ చూపిన కనికరం, మానవత్వాన్ని నెటిజన్లు  ప్రశంసిస్తున్నారు. “అది ఒక తల్లిదండ్రులు ఇచ్చే ఆలింగనం లాంటిది” అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే, “సైనికుల పట్ల ఉన్నతాధికారులు ఇలాంటి ప్రేమను చూపించడం అద్భుతం” అంటూ మరికొందరు కొనియాడుతున్నారు.

View this post on Instagram

A post shared by Edy Kartono (@ednoghalyno)

Follow Us
మటన్‌లోని ప్రతీ పార్టూ పవర్‌ఫులే మావ.. ఇక ఆ రోగాల ముచ్చటే ఉండదు..
మటన్‌లోని ప్రతీ పార్టూ పవర్‌ఫులే మావ.. ఇక ఆ రోగాల ముచ్చటే ఉండదు..
నిమిషంలోనే యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవచ్చు.. మీ మొబైల్‌లోనే..
నిమిషంలోనే యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవచ్చు.. మీ మొబైల్‌లోనే..
భలే మాయ చేసిన మెగాస్టార్.. ఏంటి కాకా ఇది.. ?
భలే మాయ చేసిన మెగాస్టార్.. ఏంటి కాకా ఇది.. ?
పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్.. వధువు ఎవరంటే?
పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్.. వధువు ఎవరంటే?
మహిళలకు గుడ్‌న్యూస్.. ఇకపై డీలక్స్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం!
మహిళలకు గుడ్‌న్యూస్.. ఇకపై డీలక్స్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం!
ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆ రాశుల వారికి సక్సెస్..!
ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆ రాశుల వారికి సక్సెస్..!
ఐపీఎల్‌ వేలంలో మూడు జట్ల టార్గెట్ అతడే.. అంత స్పెషల్ ఏంటంటే?
ఐపీఎల్‌ వేలంలో మూడు జట్ల టార్గెట్ అతడే.. అంత స్పెషల్ ఏంటంటే?
ఏపీలో హైస్పీడ్ రోడ్ కారిడార్.. నేరుగా అమరావతికి కనెక్టివిటీ..
ఏపీలో హైస్పీడ్ రోడ్ కారిడార్.. నేరుగా అమరావతికి కనెక్టివిటీ..
ట్రైనింగ్ వేడుకలో ఒంటరిగా సైనికుడు! కమాండర్ హగ్ తో కంటతడి!
ట్రైనింగ్ వేడుకలో ఒంటరిగా సైనికుడు! కమాండర్ హగ్ తో కంటతడి!
ఈ రాశులకు రక్షాబంధన్ తర్వాత అదృష్టం మామూలుగా ఉండదు.. పట్టిందల్లా
ఈ రాశులకు రక్షాబంధన్ తర్వాత అదృష్టం మామూలుగా ఉండదు.. పట్టిందల్లా