Viral News: రోడ్డుపై అర్ధ నగ్న ప్రదర్శనకు దిగిన ఎయిర్‌హోస్టెస్‌లు…కారణమేంటంటే…

|

Oct 27, 2021 | 12:29 PM

వేతనాల్లో కోతలు, ఉద్యోగాల నష్టంపై ఇటలీలోని ఎయిర్‌ హోస్టెసల్‌లు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ అర్ధ నగ్న ప్రదర్శనలు..

Viral News: రోడ్డుపై అర్ధ నగ్న ప్రదర్శనకు దిగిన ఎయిర్‌హోస్టెస్‌లు...కారణమేంటంటే...
Follow us on

వేతనాల్లో కోతలు, ఉద్యోగాల నష్టంపై ఇటలీలోని ఎయిర్‌ హోస్టెసల్‌లు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ అర్ధ నగ్న ప్రదర్శనలు నిర్వహించారు. రాజధాని రోమ్‌ నగరంలోని ప్రఖ్యాత టౌన్‌ హాల్‌ ముందు తమ యూనిఫాంలు విప్పి ఆందోళన నిర్వహించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటలీకి చెందిన ఐటీఏ ఎయిర్‌వేస్‌ను మరోక ఎయిర్‌లైన్‌ సంస్థ అలిటాలియా సొంతం చేసుకుంది. ఇది ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తోన్న ఉద్యోగులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. కొత్తగా 10,500 మంది సిబ్బందిని నియమించుకున్న అలిటాలియా…ఐటీఏ ఎయిర్‌వేస్‌కు సంబంధించి కేవలం 2,600 మందికే ఉద్యోగాలు కల్పించింది. ఈ నిర్ణయాలతో మనస్థాపం చెందిన ఎయిర్‌హోస్టెస్‌లు రోడ్డుపై అర్ధనగ్న నిరసనలకు దిగారు.

అందుకే ఈ ఆందోళన..
ఐటీఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సుమారు 50 మంది ఉద్యోగులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ‘సీనియారిటీ ప్రకారం మాకు రావాల్సిన ఉద్యోగాలు దక్కలేదు. మా సహోద్యోగుల్లో చాలామందిని పక్కన పెట్టారు. మా వేతనాల్లో కూడా భారీగా కోతలు విధించారు. ఈ ఉద్యోగాలు ఎంత కాలం ఉంటాయో తెలియని దీన పరిస్థతుల్లో ఉన్నాం. అందుకే ఇలా నిరసనల ద్వారా మా గొంతుక వినిపించాలనుకున్నాం’ అని ఐటీఏ సీనియర్‌ ఉద్యోగి ఒకరు తెలిపారు. ఈ నిరసనలపై ఐటీఏ ఎయిర్‌వేస్‌ ప్రెసిడెంట్‌ అల్ఫ్రెడ్‌ అల్టావిల్లా స్పందిస్తూ ‘ మా ఉద్యోగులందరూ నిబంధనలను అనుసరించే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వారు సమ్మెకు దిగుతారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగితే మాత్రం వారిపై తీవ్ర చర్యలుంటాయి’ అని చెప్పుకొచ్చారు.

Also Read:

Attack on Hindus: బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు.. కారణం ఇదేనా?

Bluefin Tuna Fish: మళ్ళీ కనిపించిన ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేప.. దీని ధర ఎంతో తెలిస్తే షాక్..

Corona Virus: రష్యాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా భారీగా కేసులు నమోదు