పోర్న్ సైట్‌పై పరువు నష్టం దావా వేసిన మహిళలు.. తమ వీడియోలను ఇంటర్‌నెట్‌లో పెట్టినందుకు రూ.290 కోట్లు డిమాండ్.
కెనెడాకు చెందిన ఓ ప్రముఖ పోర్న్ కంపెనీ పేరెంట్ కంపెనీ అయిన మైండ్ గీక్‌పై 40 మంది మహిళలు భారీ పరువు నష్టం దావా వేశారు. నిబంధనలకు విరుద్దంగా తమ వీడియోలను కంపెనీ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిందనేది సదరు మహిళల వాదన.

40 women suing pornhub company: కెనడాకు చెందిన ఓ ప్రముఖ పోర్న్ కంపెనీ పేరెంట్ కంపెనీ అయిన మైండ్ గీక్‌పై 40 మంది మహిళలు భారీ పరువు నష్టం దావా వేశారు. నిబంధనలకు విరుద్దంగా తమ వీడియోలను కంపెనీ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిందనేది సదరు మహిళల వాదన. బాధితుల వాదన ప్రకారం.. పోర్న్ సైట్ కోసం తాము ఇచ్చిన వీడియోలను తమ అంగీకరం లేకుండా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయకూడదనే నిబంధనను కంపెనీ అతిక్రమించిందన్నారు. ఇంటర్‌నెట్‌లో పోస్ట్ చేసిన తమ వీడియోలను తొలగించమని గతంలో విన్నవించినా మైండ్ గీక్ పెడచెవిన పెట్టిందని తెలిపారు. తమ వీడియోలను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోర్న్ హబ్ ద్వారా ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎంతో ఒత్తిడికి గురయ్యామని ఆ 40 మహిళలు కోర్టు మెట్లు ఎక్కారు. సందరు కంపెనీ నుంచి తమకు ఒక్కొక్కరికి ఒక్కో మిలియన్ డాలర్ చొప్పున మొత్తం 40 మిలియన్ డాలర్లను పరువు నష్టం కింద అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే మన కరెన్సీలో రూ. 290 కోట్లు అన్నమాట.
ఇక ఇదిలా ఉంటే మైండ్ గీక్ కంపెనీ చట్ట విరుద్ధంగా పోర్న్ హబ్ సైట్‌లో బాలలపై వేధింపులు, రేప్ వీడియోలు వంటి కంటెంట్‌ను పోస్ట్ చేస్తుందని గతంలో ఆరోపణలు వచ్చాయి. దీంతో పోర్న్ హబ్ నుంచి కొనుగోళ్లు చేయకుండా తమ వినియోగదారుల క్రెడిట్ కార్డులు వీసా, మాస్టర్ కార్డు బ్లాక్ చేశాయి. ఈ నేపథ్యంలోనే పోర్న్ హబ్ చట్టవిరుద్దమైన వీడియోలను తొలగించే పనిలో పడిందని గత కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా 40 మంది మహిళలు పరువు నష్టం దావా వేయడంతో ఈ పోర్న్ హబ్ సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది.
