భర్త మిస్‌ అయ్యాడంటోన్న భార్య.. కరోనాతో చనిపోయాడన్న వైద్యులు..!

కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన తన భర్త కనిపించడం లేదంటూ ఓ హైదరాబాద్‌ మహిళ మంత్రి కేటీఆర్‌కి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంకు చెందిన మాధవి అనే మహిళ..

భర్త మిస్‌ అయ్యాడంటోన్న భార్య.. కరోనాతో చనిపోయాడన్న వైద్యులు..!
Follow us

| Edited By:

Updated on: May 22, 2020 | 4:19 PM

కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన తన భర్త కనిపించడం లేదంటూ ఓ హైదరాబాద్‌ మహిళ మంత్రి కేటీఆర్‌కి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంకు చెందిన మాధవి అనే మహిళ.. ఈ మేరకు మంత్రిని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. కనీసం ఆయనకు సంబంధించిన వస్తువులు కూడా ఇవ్వలేదని ఆమె తెలిపారు. ఇక మే 16న తమ కుటుంబ సభ్యులందరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో మరోసారి భర్త గురించి అడిగితే.. వెంటిలేటర్‌పై ఉన్నారని వారు చెప్పారని అన్నారు. అసలు తన భర్త విషయంలో డాక్టర్లు పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని మాధవి వాపోయారు. అయితే దీనిపై ఆసుపత్రి వర్గాలు షాకింగ్ విషయాలు వెల్లడించాయి. ఆ వ్యక్తి కరోనా చికిత్స పొందుతూ చనిపోయాడని, అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయని వారు చెప్పారు.

ఏప్రిల్ 30న సాయంత్రం మధుసూదన్‌కి కరోనా వచ్చినట్లు తేలింది. అప్పటికే ఆయన పరిస్థితి విషమించింది. చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. మే 1న సాయంత్రం మధుసూదన్ మరణించాడు. నిబంధనల ప్రకారం అతడి మరణవార్తను కుటుంబ సభ్యులకు తెలిపి, మృతదేహాన్ని పోలీసులకు అప్పగించాం. దాన్ని ధ్రువీకరిస్తూ సంతకం కూడా తీసుకున్నాం. కుటుంబ సభ్యులు స్పందించకపోతే జీహెచ్‌ఎంసీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ కేసులోనూ అదే జరిగింది అని గాంధీ ఆసుపత్రి సూపరిటెండెంట్‌ రాజారావు వివరణ ఇచ్చారు. కాగా మాధవి ఈ ట్వీట్ చేసిన తరువాత ఆమె ట్విట్టర్‌ అకౌంట్‌ని తాత్కాలికంగా నిలిపివేయడం గమనర్హం.

Read This Story Also: ‘గెటౌట్‌ ప్రశాంత్ నీల్’.. ‘కేజీఎఫ్‌ 2’ దర్శకుడిపై ట్వీట్లు.. ఎందుకంటే..!