పేరుకేమో ‘టక్ జగదీష్’.. మెడలో ఐడీ కార్డు.. తీరా అసలు మ్యాటర్ తెలిస్తే దిమ్మతిరిగింది.!

వీడు సూటూ.. బూటూ వేసుకున్న 'టక్ జగదీష్'.. మెడలో ఐడీ కార్డు చూస్తే క్రైమ్ ఇంటలిజెన్స్ అధికారి అని అందరూ అనుకుంటారు. తీరా మనోడు బాగోతం తెలిస్తే ప్రతీ ఒక్కరూ దెబ్బకు కంగుతినాల్సిందే. ఇంతకీ ఈ స్టోరీ అసలేంటి మీరు అనుకుంటున్నారా.? ఇది మన హైదరాబాద్‌లోని రాయదుర్గం పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

పేరుకేమో 'టక్ జగదీష్'.. మెడలో ఐడీ కార్డు.. తీరా అసలు మ్యాటర్ తెలిస్తే దిమ్మతిరిగింది.!

|

Updated on: Mar 13, 2024 | 7:20 PM

రాయదుర్గంలో నకిలీ పోలీస్‌గా చలామణీ అవుతున్న సాయి కిరణ్ తేజ అనే యువకుడి ఆట కట్టించారు మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు. గత కొన్నిరోజులుగా సైబరాబాద్ పరిధిలోని బ్యూటీ పార్లర్‌ల యజమానులను క్రైం ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ నకిలీ గుర్తింపు కార్డు చూపించి మరికొండ సాయి కిరణ్ తేజ(30) బెదిరిస్తూ అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్నట్టు మాదాపూర్ SOT పోలీసులకు సమాచారం అందింది. దీంతో సదరు నిందితుడిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం రాయదుర్గంలోని స్టార్ వెల్నెస్ అండ్ ఫ్యామిలీ సెలూన్ యజమానిని బెదిరించి రూ. 10 వేలు పట్టుకుని బయటకు వస్తున్న నిందితుడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు మాదాపూర్ SOT పోలీసులు. సదరు నిందితుడి వద్ద నుంచి రూ. 10 వేలు నగదు, ఒక మొబైల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడ్ని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఖాకీలు.

Follow us
మీరు ఇప్పుడే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలా?
మీరు ఇప్పుడే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలా?
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం