Video: బురఖా వేసుకొచ్చి సెక్యూరిటోళ్ళకు దొరికిండు.. వీడియో
సీన్మల్లల్ల హీరోయిన్ను కల్షేతందుకు హీరో బుర్క ఏస్కోని పోయి సెక్యుర్టోల్లను..హిరోయిన్ దోస్తులను బురిడి కొట్టిస్తడు..అదంత సీన్మల సూస్తందుకు మంచిగనే అన్పిస్తది..అదే నిజంగ జర్గిందన్కోండ్రి..ఊకుంటరా..? తోలుతీషి దండం మీద ఆరేస్తరు.. కరీంనగర్ల కూడ గసోంటి ముచ్చట్నే అయింది.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మరీ ఏం చేద్దామని అచ్చిండ్రోగాని కరీంనగర్లున్న ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీ హస్టల్లకు ఒక సుప్పనాతోడు బుర్క ఏస్కోని అచ్చిండు.. చూసే వరకు లేడీస్ బాత్రుంల సొర్రిండు.. ఆయ్నెంబడి ఇంకోగామే కూడ బుర్క ఏస్కోని ఉన్నది.. సెక్యుర్టోల్లకు నడ్క నడ్త చూసి అన్మానమొచ్చి ఆపే వరకు ఉర్కిపోయి బాత్రూంల సొర్రి దాక్కుండు ..బాత్రుంలకెల్లి బైటకు గుంజుకొచ్చి పొట్టు పొట్టు తోమిండ్రిట్ల.
Published on: Sep 08, 2025 09:10 PM
Follow Us
వైరల్ వీడియోలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

