Watch Video: ఇండియా దగ్గర 172.. పాకిస్తాన్ దగ్గర 170.. ఇది అణ్వాస్త్రాల లెక్క

|

Jun 20, 2024 | 1:50 PM

ఓ వైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ రక్షణ కోసం ఆయుధాలను సమకూర్చుకోవడానికి మాత్రం పాక్ పెద్ద పీట వేస్తోంది. అందుకే తమ అణ్వాయుధాల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తోంది. తాజాగా స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ -సిప్రీ వెల్లడించిన వివరాల ప్రకారం పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఓ వైపు రష్యా-యుక్రెయిన్ యుద్ధం… ఆ యుద్ధాన్ని ఆపేస్తానంటూ పుతిన్ విధించిన షరతులపై మండిపడ్డాయి కొన్ని దేశాలు. మరోవైపు ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధం కొనసాగుతునే ఉంది. చైనా-తైవాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇవన్నీ ఇలా ఉంటుండగానే కొందరు ఈ తరం నోస్టర్ డామస్‌లు అదిగో మూడో ప్రపంచం యుద్ధం అంటూ భయపెడుతునే ఉన్నారు. ఈ నేపథ్యంగా తాజాగా విడుదల ఓ నివేదిక… ప్రపంచ దేశాలు తమ రక్షణ విషయంలో రోజు రోజుకీ ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారో స్పష్టంగా అర్థమవుతోంది.  ఓ వైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ రక్షణ కోసం ఆయుధాలను సమకూర్చుకోవడానికి మాత్రం పాక్ పెద్ద పీట వేస్తోంది. అందుకే తమ అణ్వాయుధాల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తోంది. తాజాగా స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ -సిప్రీ వెల్లడించిన వివరాల ప్రకారం పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నట్టు తెలుస్తోంది.

పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి

 

Follow us on