యుద్ధాలు ఆపడంలో నేనే తోపు.. మరోసారి ట్రంప్ సొంత డబ్బా

Updated on: Oct 15, 2025 | 8:15 PM

అమెరికా మధ్యవర్తిత్వంతో గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అక్టోబర్ 13న ఈజిప్ట్ వేదికగా ఇరుపక్షాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇరుదేశాలు బందీలు, ఖైదీలను పరస్పరం అప్పగించుకోనున్నాయి. గాజా శాంతి ఒప్పందం సందర్భంగా ట్రంప్ మరోసారి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు.

యుద్ధాలు ఆపడంలో తానే తోపునని.. తనను మించినవారే లేరని ఆయనకు ఆయనే గొప్పలు చెప్పుకున్నారు. యుద్ధాలు ఆపడంలో తాను స్పెషలిస్టునని బీరాలు పలికారు. ఇప్పటి వరకు ఏడు యుద్ధాలు ఆపానని.. హమాస్-ఇజ్రాయెల్ వార్ తాను ఆపిన ఎనిమిదో యుద్ధమని చెప్పారు. నోబెల్ బహుమతి కోసమే తాను ఇదంతా చేస్తున్నాననే వాదనలను ఆయన తోసిపుచ్చారు. తన శాంతి కార్యక్రమాలు లక్షలాది మంది ప్రాణాలను కాపాడాయని.. ఇది తనకు చాలా గౌరవమని అన్నారు. తాను ఇదంతా చేసేది శాంతి బహుమతి కోసం కాదని.. అమాయక ప్రజల ప్రాణాలను కాపాడటం కోసమేనని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను రక్షించానన్నారు. తన దౌత్యం… అవార్డులు గెలుచుకోవడం కంటే ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. సుంకాలు విధిస్తానని హెచ్చరించి ఇండియా, పాక్ వార్ కూడా ఆపానని మళ్లీ అదే పాత పాడారు. తాజాగా పాకిస్తాన్-ఆప్ఘానిస్తాన్ యుద్ధం గురించి విన్నానని.. ఇరు దేశాలు సంయమనం పాటించాలని చెప్పానన్నారు. పాక్, ఆప్ఘాన్ యుద్ధాన్ని కూడా తానే పరిష్కరిస్తానని చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆన్ లైన్ లో సరుకులు ఆర్డర్ చేస్తున్నారా? రూ.2 లక్షల మోసం గురించి మీకు తెలుసా?

వేగంగా దూసుకెళ్తున్న కారు.. ఒక్కసారిగా

దీపావళికి ముందు ఇలా చేయండి..ఇంటికున్న దరిద్రం పారిపోతుంది

మ్యాన్‌ ఈటర్‌ మళ్లీ వచ్చింది.. రైతును ఈడ్చుకెళ్లి

టెక్కీలకు షాక్ H-1B హైరింగ్ ఆపేసిన TCS

Loading...
Unable to load recommendations.
Follow Us