నాడు మనసులు కలిస్తే.. నేడు చాట్‌జీపీటీ ‘ఓకే’ అంటేనే..

Updated on: May 24, 2026 | 4:09 PM

ఒకప్పుడు కేవలం మనసులు కలవడం, పరస్పర ఆకర్షణ ఆధారంగా ప్రేమ చిగురించేది. కానీ నేటి యువత మాత్రం ప్రేమలో పడటానికి ముందే గూగుల్, రెడిట్, జ్యోతిష్యంతో పాటు సరికొత్త ఏఐ టూల్స్‌ను ఉపయోగించి, తగిన భాగస్వామి ఎవరనేది ముందే అంచనా వేస్తున్నారు. దీనినే ‘ప్రెడిక్టివ్ డేటింగ్’ అంటున్నారు. డేటింగ్‌ కు వెళ్లే ముందు గూగుల్‌లో వ్యక్తిత్వ లక్షణాలను శోధించడం, రెడిట్ థ్రెడ్‌లను పరిశీలించడం, సోషల్‌ మీడియాలో రిలేషన్‌షిప్ సైకాలజీ రీల్స్ చూడటం వంటివి చేస్తున్నారు. భావోద్వేగాల పరంగా సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో యువత ఇంటర్నెట్‌ సమాచారమే పరమావధిగా భావిస్తోంది.

ఈ సరికొత్త ట్రెండ్‌కు ప్రధాన కారణం నేటి తరం ఆలోచనల్లోని మార్పులే. యువత తమకు సరిపడని వ్యక్తి కోసం తమ సమయాన్ని వృథా చేయాలని అనుకోవడం లేదు. ‘మనం మానసికంగా ఒకరికొకరు సరిపోతామా?’, ‘భవిష్యత్తులో ఈ బంధం నిలబడుతుందా?’ అనే ప్రశ్నలను డేటింగ్‌కు ముందే విశ్లేషిస్తున్నారు. సమస్యలు వచ్చిన తర్వాత బాధపడటం కంటే, ముందే ఊహించి తప్పుకోవడం మంచిదనే ధోరణి పెరుగుతోంది. సోషల్ మీడియా పుణ్యమా అని సైకాలజీ కి సంబంధించిన పదాలు నేడు సాధారణ సంభాషణల్లో భాగమయ్యాయి. ‘లవ్ బాంబింగ్’, ‘గ్యాస్‌లైటింగ్’, ‘ఎమోషనల్ అవైలబిలిటీ’ వంటి పదాలను యువత తమ రోజువారీ మాటల్లో ఉపయోగిస్తున్నారు. ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌ల ద్వారా ఈ విషయాలు అందరికీ సులువుగా చేరుతున్నాయి. అది ఒక రకంగా హానికర అలవాట్లను గుర్తించడానికి సహాయపడుతున్నప్పటికీ, బంధం సహజంగా బలపడక ముందే అవతలి వ్యక్తిని అతిగా విశ్లేషించే ప్రమాదానికి కూడా దారితీస్తోంది. కేవలం సైకాలజీ మాత్రమే కాకుండా రాశిఫలాలు, జ్యోతిష్య అనుకూలత, పర్సనాలిటీ టెస్టులు, ఏఐ అందించే రిలేషన్‌షిప్ సలహాలను ఎక్కువగా నమ్ముతున్నారు. యువతీ యువకుల్లో కొందరు బంధంలోకి అడుగుపెట్టడానికి ముందే తమ జాతక చక్రాలను పరస్పరం పంచుకుంటున్నారు. డేటింగ్ యాప్స్ వల్ల మనుషులు కలవడం సులువైనా, నమ్మకాన్ని ఏర్పరుచుకోవడం కష్టంగా మారింది.

మరిన్ని వీడియో కోసం : 

న్యూ రికార్డ్స్ ను టార్గెట్ చేస్తున్న రామాయణ!

జాన్వీ కపూర్ కోలీవుడ్ డెబ్యూ

చాలా ఏళ్లుగా బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆమిర్‌ఖాన్

దృశ్యం 3 హిట్టా..? ఫట్టా..?

 

 

Follow Us