ఆ హోటల్‌ను విడిచిపెట్టి వెంటనే వెళ్లిపోండి..! తమ పౌరుల్ని అలర్ట్‌ చేసిన అమెరికా, బ్రిటన్.. వీడియో

Updated on: Oct 15, 2021 | 9:51 AM

అఫ్గానిస్థాన్‌లో ఉన్న తమ పౌరుల్ని అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు అలర్ట్‌ చేశాయి. కాబుల్‌లోని హోటల్‌కు ఉగ్రముప్పు పొంచి ఉందని వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించాయి.

అఫ్గానిస్థాన్‌లో ఉన్న తమ పౌరుల్ని అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు అలర్ట్‌ చేశాయి. కాబుల్‌లోని హోటల్‌కు ఉగ్రముప్పు పొంచి ఉందని వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించాయి. ‘భద్రతా కారణాల దృష్ట్యా సెరెనా హోటల్‌లో, దానికి దగ్గర్లో ఉన్న అమెరికన్లు వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచివెళ్లాలి’ అంటూ యూఎస్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. బ్రిటన్ ప్రభుత్వం కూడా తమవారికి ఈ తరహా హెచ్చరికే చేసింది. “హోటల్‌లో ఉండొద్దు. మరీ ముఖ్యంగా కాబుల్‌లోని సెరెనా హోటల్‌ను విడిచివెళ్లండి’ అంటూ సూచనలు చేసింది. గత వారం షియాలు లక్ష్యంగా ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు దాదాపు 150 మంది గాయపడ్డారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: 2 సెకెన్లలో 3 బాటిళ్లు ఫ్లిప్‌చేసిన మాథ్యూ.. బాటిల్స్‌ ఫ్లిప్పింగ్‌ ఛాలెంజ్‌లో గిన్నిస్‌ రికార్డ్‌.. వీడియో

Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇందులో ఉమ్మితే మొక్కలు పెరుగుతాయ్‌.. వీడియో

Published on: Oct 15, 2021 09:50 AM
Loading...
Unable to load recommendations.
Follow Us