USలో భారత విద్యార్థులకు ఉపశమనం.. ట్రంప్‌ నిర్ణయానికి కోర్టు బ్రేక్‌

Updated on: Sep 15, 2026 | 9:10 PM

బరువు తగ్గేందుకు కేవలం డైటింగ్‌ లేదా వ్యాయామంపై మాత్రమే ఆధారపడటం సరిపోదని హైదరాబాద్‌లోని ICMR-NIN సమీక్షా పరిశోధన సూచిస్తోంది. 50కిపైగా దేశాల్లో 5 లక్షల మందికి పైగా పాల్గొన్న 112 పరిశోధనలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు, ఆహార నియంత్రణతో పాటు క్రమం తప్పని వ్యాయామం పాటించడం దీర్ఘకాలిక ఫలితాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. క్రాష్‌ డైటింగ్‌ కంటే సమతుల్య ఆహారం, శారీరక శ్రమ, జీవనశైలి మార్పులే స్థిరమైన బరువు నిర్వహణకు కీలకమని తెలిపారు.

అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఒక పెద్ద ఊరట లభించింది. అంతర్జాతీయ విద్యార్థుల వీసాల గడువును నాలుగేళ్లకు కుదిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధన అమలును అక్కడి ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా అడ్డుకుంది. ఇప్పటివరకు అమెరికాలో విదేశీ విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి వీలుండేది. అయితే, ట్రంప్ సర్కార్ తీసుకువచ్చిన కొత్త రూల్స్ ప్రకారం వీసా గడువు నాలుగేళ్లకు మాత్రమే పరిమితం అవుతుంది. ఆ తర్వాత చదువు కొనసాగించాలన్నా, కాలేజ్ మారాలన్నా లేదా కోర్సు మార్చాలన్నా ఇమ్మిగ్రేషన్ అధికారుల నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పీహెచ్‌డీ చేసే విద్యార్థులకు ఇది పెద్ద భారంగా మారేది. ఎందుకంటే అమెరికాలో డాక్టోరల్ కోర్సులు పూర్తి కావడానికి సగటున 5.7 ఏళ్ల సమయం పడుతుంది. ఈ నిబంధనను జాతీయ భద్రత కోసమే మారుస్తున్నట్లు ప్రభుత్వం వాదించింది. అయితే, ప్రభుత్వం చెప్పిన కారణాలు అంత బలంగా లేవని బోస్టన్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి ఎఫ్. డెన్నిస్ సేలర్ స్పష్టం చేశారు. ఈ నిబంధన అమలైతే అమెరికా యూనివర్సిటీలతో పాటు అక్కడి ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కొత్త నిబంధనపై వచ్చిన సుమారు 22 వేల అభిప్రాయాల్లో ఎక్కువ మంది దీనిని వ్యతిరేకించడం గమనార్హం. మంగళవారం నుంచి అమల్లోకి రావాల్సిన ఈ నిబంధనపై కోర్టు దేశవ్యాప్తంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యార్థులకు తాత్కాలికంగా ఉపశమనం దక్కింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ అక్టోబర్ 2న జరగనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సిబ్బందిపై కారం చల్లి బ్యాంకులో దోపిడీ..

కన్నబిడ్డల పట్ల కర్కశంగా మారుతున్న తల్లిదండ్రులు.. ఎందుకు?

Neena Gupta: 67ఏళ్ల వయసులో ప్రెగ్నెంటా..? ఇచ్చిపడేసిన ఒకప్పటి హీరోయిన్

Epic: ఎపిక్‌ సూపర్ కలెక్షన్స్‌.. డే1 ఎంతంటే?

Hanuman Ansh: త్రివిక్రమ్ తీసుకొస్తున్నారు సరే తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు?

Loading...
Unable to load recommendations.
Follow Us