Viral Video: 29ఏళ్ల యువకుడికి 44ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్‌..! నెలకు 11లక్షల జీతం.. వీడియో

|

Oct 22, 2021 | 7:33 PM

యూఎస్‌కు చెందిన 44 ఏళ్ల ఓ మహిళా టిక్‌టాక్ యూజర్ తన ప్రియుడికి నెలవారీ జీతంగా ఏకంగా కొన్ని లక్షలను చెల్లిస్తుంది. టిక్ టాక్ తో ఫేమస్ అయిన జూలీ తనకంటే 15 ఏళ్ళు చిన్నవాడిని బాయ్‌ఫ్రెండ్‌గా ఎంచుకుంది....

YouTube video player

యూఎస్‌కు చెందిన 44 ఏళ్ల ఓ మహిళా టిక్‌టాక్ యూజర్ తన ప్రియుడికి నెలవారీ జీతంగా ఏకంగా కొన్ని లక్షలను చెల్లిస్తుంది. టిక్ టాక్ తో ఫేమస్ అయిన జూలీ తనకంటే 15 ఏళ్ళు చిన్నవాడిని బాయ్‌ఫ్రెండ్‌గా ఎంచుకుంది…. అతనితో ఇంటి పనులు చేయిస్తూ..నెలకు అక్షరాలా 11 లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్లు జూలి తెలిపింది. అంతేకాదు తన బాయ్ ఫ్రెండ్ కు కావాల్సినవన్నీ తానే కొనిపెడతానని చెప్పింది..అందుకు అతడు…తను చెప్పిన అన్ని పనులు చేయాల్సి ఉందని అంది..ఎంతో సంపన్న కుటుంబం నుంచి వచ్చిన జూలీ తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇంత మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఒకసారి స్విమ్మింగ్ ఫుల్ ని శుభ్రం చేయడం మరచిపోయాడని.. అప్పుడు అతని జీతాన్ని కట్ చేసినట్లు తెలిపింది. ఓ వైపు భారీగా జీతం ఇస్తూనే.. మరోవైపు అతనికి కావాల్సినవన్నీ సమకూరుస్తానని తెలిపింది. అయితే, తనకంటే, 15ఏళ్లు చిన్నవాడితో సహజీవనం చేస్తున్నందుకు..ఎవరు ఏమనుకున్నా పట్టించుకోమని చెప్పింది జూలి. తనకు యువకుడు అంటే ఇష్టమని అతనితోనే ఉంటానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే, జూలీ టిక్ టాక్ తో మంచి ఫేమస్.. ఆమెకు మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Chandrababu Speech: దీక్షాస్థలిలో చంద్రబాబు ప్రసంగం.. లైవ్ వీడియో

Viral Video: ఘోర ప్రమాదం..! ట్రక్కును ఢీ కొట్టిన రైలు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..