Vitamin D: ‘సన్‌షైన్’ విటమిన్… ఇది లోపిస్తే చాలా కష్టం!

Updated on: Jun 12, 2026 | 6:10 PM

ఆధునిక జీవనశైలి కారణంగా యువతలో విటమిన్ డి లోపం పెరుగుతోంది. ఎముకలు, దంతాల బలానికి, రోగనిరోధక శక్తికి ఈ విటమిన్ కీలకం. అలసట, కండరాల బలహీనత, ఎముకల నొప్పులు, తరచూ ఇన్ఫెక్షన్లు రావడం దీని లోప లక్షణాలు. ప్రతిరోజూ 15-20 నిమిషాలు సూర్యరశ్మిలో గడపడం, పోషకాహారం తీసుకోవడం ద్వారా విటమిన్ డి స్థాయిలను మెరుగుపరచుకోవచ్చు.

నేటి ఆధునిక జీవనశైలి, మారుతున్న ఆహార అలవాట్లు మనుషులను సరికొత్త ఆరోగ్య సమస్యల వైపు నెడుతున్నాయి. శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో విటమిన్ ‘డి’ ఒకటి. దీనిని ‘సన్‌షైన్ విటమిన్’ అని కూడా పిలుస్తారు. మన ఎముకల ఆరోగ్యం నుండి రోగనిరోధక శక్తి వరకు ఎన్నో కీలకమైన విధుల్లో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే, గంటల తరబడి ఏసీ గదుల్లోనే గడపడం, ఎండ తగలకపోవడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల ప్రస్తుతం యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఈ విటమిన్ లోపం తీవ్రంగా కనిపిస్తోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ డి మన శరీరంలో కాల్షియం, ఫాస్ఫరస్‌లను గ్రహించడంలో సహాయపడుతుంది. తద్వారా ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి. పిల్లల శారీరక ఎదుగుదలలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వృద్ధులలో ఎముకల బలహీనత కలిగించే ‘ఆస్టియోపోరోసిస్’ ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఇది రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసి, శరీరాన్ని వివిధ ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది. కండరాల పనితీరును మెరుగుపరిచి, వాటిని బలంగా మార్చడంలో కూడా విటమిన్ డి పాత్ర ఎంతో ఉంది. శరీరంలో విటమిన్ డి లోపించినప్పుడు కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. వీటిని సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. తగినంత నిద్ర ఉన్నా ఎప్పుడూ అలసటగా, నీరసంగా అనిపించడం. కండరాల బలహీనత, ఎముకలు, కీళ్లలో తరచూ నొప్పులు రావడం. రోగనిరోధక శక్తి తగ్గి, తరచుగా జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడటం. గాయాలు త్వరగా మానకపోవడం, శారీరక నొప్పులతో పాటు మానసిక ఆందోళన కలగడం.. ఇవన్నీ విటమిన్ డీ తగ్గినప్పుడు కనిపించే లక్షణాలే. విటమిన్ డిని పొందడానికి అత్యంత సహజమైన, ఉచితంగా దొరికే సులభమైన మార్గం సూర్యరశ్మి. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వేళ లేత ఎండలో కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు గడపడం ద్వారా మన చర్మం దానంతటదే విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. సూర్యరశ్మితో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా పాలు, పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తులు, గుడ్డు పచ్చసొన , పుట్టగొడుగులు , ఫ్యాటీ ఫిష్ , తృణధాన్యాలు, నారింజ రసాన్ని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా విటమిన్ డి స్థాయిలను మెరుగుపరుచుకోవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యుల సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్లు వాడాల్సి ఉంటుంది. లోపం వచ్చిన తర్వాత బాధపడటం కంటే, రాకుండా జీవనశైలిని మార్చుకోవడమే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Top 9 ET News: ప్రభాస్‌తో ధురంధర్ దర్శకుడు సినిమా.. ఇదిగో క్లారిటీ..

Peddi: నయా కలెక్షన్స్‌ కింగ్! బాక్సాఫీస్‌కు అసలైన ఛాంపియన్ ‘పెద్ది’

Ram Charan: బన్నీ.. నీ ‘రాకా’ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా.. – చరణ్

Allu Arjun: ఇంటికెళ్లి మరీ పవన్‌ను పరామర్శించిన బన్నీ

మగ తోడు ఉంటేనే పిల్లల్ని కనగలరా? మరి ఈ చేప సంగతేంటి?

Loading...
Unable to load recommendations.
Follow Us