బట్టలు తీసుకుందామని కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
విశాఖ జిల్లా లంకెలపాలెం సమీపంలోని వినాయక నగర్‌లో ఓ మహిళకు కబోర్డులో పాము కనిపించడంతో భయాందోళనకు గురైంది. చీర తీసేందుకు చేయి పెట్టిన సమయంలో లోపల దాగి ఉన్న పామును గుర్తించి కేకలు వేస్తూ బయటకు పరుగెత్తింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా బయటకు తీశారు. అది విషరహిత జెర్రిపోతు పాముగా నిర్ధారించారు.
ఇంటి కబోర్డు తెరచి బట్టలు తీద్దామని చేయి పెట్టిన ఓ మహిళకు ఊహించని దృశ్యం భయాందోళనకు గురిచేసింది. విశాఖ జిల్లా లంకెలపాలెం సమీపంలోని వినాయక నగర్‌కు చెందిన ఓ ఇంట్లో ఈ వింత చోటుచేసుకుంది. సదరు ఇంట్లోని మహిళ వస్త్రాలు పెట్టుకునే కబోర్డులోంచి చీరను బయటకు తీసేందుకు చేయి పెట్టింది. ఆ సమయంలో లోపల నక్కి ఉన్న పామును చూసి భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగుతీసింది. వెంటనే కుటుంబసభ్యులు అప్రమత్తమై స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్, కబోర్డులో దాగి ఉన్న పామును అత్యంత సమర్థవంతంగా పట్టుకుని బయటకు తీశారు. దీంతో ఆ ఇంట్లోని వారితో పాటు స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత పరిశీలించగా అది సాధారణ జెర్రిపోతు పాముగా స్నేక్ క్యాచర్ నిర్ధారించాడు. గోధుమ రంగులో ఉండే ఈ పాము పూర్తి విషరహితమైన సర్ప జాతికి చెందినదని, సాధారణంగా ఇళ్లలోకి వచ్చే ఎలుకలను వేటాడి ఆహారంగా తీసుకునే క్రమంలో కబోర్డులోకి చొరబడి ఉంటుందని స్నేక్ క్యాచర్ స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ను పరామర్శించిన దుబాయ్ రాజు
కొట్టేసిన చీరలను తిరిగి కొరియర్‌లో పంపిన దొంగలు.. అసలేం జరిగిందంటే!
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం.. ఇదే అసలైన సంస్కారం అంటూ..
కేతన్ హత్య కేసులో సంచలన విషయాలు.. చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు!
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. రూ.1కే 24 రోజులు ఉచిత కాల్స్
