వారెవ్వా..పోలీస్ వాహనం ముందు మహిళ అదిరిపోయే డ్యాన్స్..వీడియో

Updated on: Aug 27, 2025 | 1:12 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ రోడ్డుపై డాన్స్ చేసింది. రోడ్డుపై డాన్స్ చేయడంతో షాక్ అవడానికి ఏముందీ అనేగా మీ సందేహం. రోడ్డుపై డాన్స్ చేసి ఉంటే అంత చర్చించుకోవాల్సిన అవసరం ఉండదు.. కానీ ఆమె రోడ్డుపై పోలీసు వాహనం ఎదురుగా రీల్‌ చేసింది.

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో మహిళలు యువకులతో పోటీపడి మరీ రీల్స్ చేస్తున్నారు. కొందరు మగవారు కూడా షాక్ అయ్యేలా ప్రవర్తిస్తున్నారు. ఇంకొందరు రోడ్ల మీదకు వచ్చి రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలను నెట్టింట నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ మహిళ నడి రోడ్డుపై పోలీసు వాహనం ముందు డాన్స్ చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. పోలీసులు చూస్తున్నా కూడా ఏ మాత్రం బిడియం, భయం లేకుండా డాన్స్ చేస్తూనే ఉంది. ఈమె డాన్స్ చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. అయితే ఈమెతో ఎందుకొచ్చిన సమస్య అని అనుకున్నారేమో గానీ.. అలా చూస్తుండిపోయారు తప్ప ఆమెను వారించే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆమె మరింత రెచ్చిపోయింది. చాలా సేపు అలాగే డాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ‘వీధి కుక్కలను కాదు.. ముందు ఇలాంటి వారిని రోడ్ల మీదకు రాకుండా చేయండి’ అంటూ కొందరు, ‘పోలీసులు ఆమెను వారించకుండా.. అలా చూస్తుండిపోవడమేంటీ’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఖైరతాబాద్‌ గణపతిని చూశారా?వీడియో

తాత నువ్వు కేక.! ఇలా కూడా వ్యాపారం చేయొచ్చా?వీడియో

కొడుకు ప్రాణాల కోసం.. మొసలితో తల్లి ఫైటింగ్‌ వీడియో