దెయ్యం పట్టిందని భర్తను చితక్కొట్టిన భార్య.. ఆ తరువాత సీన్‌ ఇదే

Updated on: Sep 01, 2025 | 9:04 PM

మద్యానికి బానిసై ఇంట్లో రోజూ గొడవపడుతున్న భర్తకు బుద్ధి చెప్పాలనుకుంది ఓ భార్య. అందుకు ఓ ప్లాన్‌ వేసింది. మామూలుగా భర్తపై భార్య చెయ్యి చేసుకుంటే చుట్టుపక్కలవారంతా నానా రచ్చ చేస్తారని భావించిన ఆ మహిళ.. తనకు దయ్యం పట్టిందంటూ కథ అల్లింది. అందుకు తగ్గ సీన్‌ క్రియేట్‌ చేసి.. భర్తకు బడితెపూజ చేసింది. భార్య తీరుకు బిత్తరపోయిన ఆ భర్త.. దెబ్బకు ఇంట్లోంచి బయటకు పరుగులు పెట్టాడు.

ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీ.ఎం.బంజర్ పంచాయతీలోని జంగాల కాలనీలో గంగారాం, లక్ష్మి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. గంగారాం మద్యానికి బానిస కావటంతో తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. రెండు రోజుల క్రితం లక్ష్మి తనకు దెయ్యం పట్టిందంటూ పెద్ద పెద్దగా కేకలు వేసింది. అంతటితో ఆగకుండా.. ఇంట్లో పడుకున్న భర్త మీదికి దూసుకుపోయి..అతడిని లేపి కూర్చోపెట్టింది. తర్వాత అతడి నోట్లో పాత గుడ్డలు కుక్కి.. కర్ర తీసుకుని చావబాదింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో భార్య పెద్దపెద్దగా అరుస్తూ.. తనను కట్టేసి బాదటంతో.. విపరీతంగా భయపడిన గంగారాం.. అరుస్తూ బయటకు పరుగులు పెట్టాడు.భార్య చేతిలో గాయపడిన గంగారాంను బంధువులు హాస్పటల్‌కు తరలించి చికిత్స అందించారు. తర్వాత బంధువులంతా దాడికి కారణమేంటిని లక్ష్మిని అడగగా.. తనకు దెయ్యం పట్టిందంటూ వింత వింతగా ప్రవర్తించింది.. దాడి అనంతరం గంగారం.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. జరిగిందంతా చెప్పాడు. తన భార్య ఉద్దేశపూర్వకంగానే తనను తీవ్రంగా కొట్టిందని వాపోయాడు. నోట్లో గుడ్డలు కుక్కి చేతులు వెనక్కి విరిచి కట్టి.. ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడిందని వీ.ఎం. బంజర్ పోలీసుల వద్ద బోరుమన్నాడు. తాను అడిగిన డబ్బు ఇవ్వలేదనే కారణంతోనే భార్య, కొడుకుతో కలిసి తన మీద దాడిచేసిందని, ఈ దాడిలో తన నాలుగు పక్కటెముకలు విరిగిపోయాయని కన్నీరు పెట్టుకున్నాడు. కాగా.. గంగారాం ఫిర్యాదు మేరకు లక్ష్మిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే గంగారాంకు మెరుగైన చికిత్స కోసం బంధువులు అతడిని ఖమ్మం తరలించారు.. ప్రస్తుతం గంగారాంకు చికిత్స కొనసాగుతోందని.. బంధువులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్య ‘బంగారం’ కోసం 18 టన్నుల చెత్తను జల్లెడ పట్టాడు

ఆకాశంలో అద్భుతం.. సెప్టెంబర్‌ 7న డోంట్‌ మిస్‌

Upasana Konidela: ఈ స్థాయి ఎవరో ఇచ్చింది కాదు.. నాకు నేనుగా సాధించుకున్నది

4 నెలల్లో 6G వస్తోంది..ప్రధాని మోదీ కీలక ప్రకటన

Balakrishna: వరద బాధితులకు అండగా.. విరాళం ప్రకటించిన బాలయ్య