దారుణం.. బిస్కెట్లు ఆశ చూపి చిన్నారిపై..

Updated on: Feb 20, 2026 | 7:53 PM

మదనపల్లి ఘటన తరహాలోనే విశాఖపట్నంలో మూడేళ్ల చిన్నారిపై అమానుష దాడి జరిగింది. బిస్కెట్లు కొనిస్తానని నమ్మించి, పరిచయస్తుడే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణంపై పోలీసులు తక్షణమే స్పందించి, నిందితుడిని గంటల వ్యవధిలోనే అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశారు. బాధితురాలికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన సమాజంలో తీవ్ర ఆగ్రహం, ఆందోళనను రేకెత్తించింది.

మదనపల్లి ఘటన మరువకముందే విశాఖలో మరో అమానుష ఘటన వెలుగుచూసింది. ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు బిస్కెట్లు కొనిస్తానని నమ్మించి లైంగిక దాడికి ఒడిగట్టాడు. నమ్మకద్రోహానికి పరాకాష్టగా నిలిచిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విశాఖ పెదగంట్యాడ మండలం గంగవరానికి చెందిన ఓ వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి మూడేళ్ల కుమార్తె ఉంది. అదే ప్రాంతానికి చెందిన ఎరిపల్లి యోగి అలియాస్ గాంధీ, బాధితురాలి తండ్రికి ఆటో డ్రైవర్‌గా పరిచయం. యోగి.. క్యాటరింగ్ పనులు చేస్తుంటాడు. క్యాటరింగ్ సామాన్లు తీసుకెళ్లే క్రమంలో బాధిత బాలిక తండ్రి ఆటోలోనే వెళుతుంటాడు యోగి. ఇదిలా ఉండగా…బుధవారం సాయంత్రం చిన్నారి తండ్రి ఇంట్లో లేని సమయం చూసి, యోగి వాళ్లింటికి వెళ్లాడు. బిస్కెట్లు కొనిస్తానని మాయమాటలు చెప్పి చిన్నారిని తీసుకెళ్ళాడు. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎప్పటికీ చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లి వెదికింది. కొద్దిసేపటికి చిన్నారిని తీసుకొచి ఏమీ తెలియనట్టు తల్లివద్ద వదిలేసి వెళ్లాడు యోగి. చిన్నారిలో ఆందోళనను గమనించిన తల్లి దుస్తులను పరిశీలించి జరిగిన దారుణాన్ని గుర్తించింది. తల్లడిల్లిపోయిన ఆమె ఇరుగుపొరుగు వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యూపోర్ట్ పోలీసులు తక్షణమే స్పందించి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితుడిని గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. త్వరితగతిన ఛార్జ్ షీట్ దాఖలు చేసి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. చిన్నారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తెలిసినవాడే ఇలాంటి దారుణానికి పాల్పడటంతో ఆ కుటుంబం దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముగిసిన ఆపరేషన్‌ టైగర్‌.. సురక్షితంగా అడవిలోకి బెబ్బులి

టెక్సాస్‌లో హనుమంతుడి విగ్రహం.. నోరు పారేసుకున్న రిపబ్లికన్‌ నేత

ఈ వీకెండ్‌లోనే.. ఇరాన్‌పై అమెరికా దాడులు !!

బస్సు కింద మంటలు.. వీడియోల కోసం ఎగబడకుండా ప్రాణాలను కాపాడిన స్థానికులు

మహా కుంభమేళాను తలపించిన త్రిశూల చక్రతీర్థ స్నానం

Follow Us