Viral Video: మొదటిసారి పిజ్జా రుచి చూసిన బామ్మ.. ఎక్స్‌‌ప్రెషన్స్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. వైరలవుతోన్న వీడియో

|

Nov 09, 2021 | 1:48 PM

Trending Video: తొలిసారి పిజ్జా తిన్న ఓ బామ్మ ఎక్స్‌ప్రెషన్స్ చూసి సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఆ ముసిముసి నవ్వులకు ఫ్యాన్స్ అవుతూ తెగ వైరల్ చేస్తున్నారు.

Viral Video: మొదటిసారి పిజ్జా రుచి చూసిన బామ్మ.. ఎక్స్‌‌ప్రెషన్స్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. వైరలవుతోన్న వీడియో
Viral Video
Follow us on

Trending Video: ఈ మధ్య సోషల్ మీడియాలో దేశీ నాని వీడియో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజానికి, ఈ బామ్మ మొదటిసారిగా పిజ్జా తినేందుకు ప్రయత్నించింది. పిజ్జా రుచి చూసిన ఆ భామ్మ ఇచ్చిన హవభావాలు ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీ ముఖంలో చిరునవ్వు తప్పకుండా వస్తుంది. అక్టోబర్ 28న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 50 వేల మందికి పైగా లైక్ చేశారు.

వైరల్ వీడియో క్లిప్‌లో ఇద్దరు బామ్మలు మంచం మీద కూర్చని పిజ్జాను తినడం చూడొచ్చు. అయితే ఇందులో ఒక బామ్మ మరొక భామ్మకు తినడానికి పిజ్జా ముక్కలను ఇస్తుంది. మొదట భామ్మ నిరాకరించినా.. తేనేందుకు మొగ్గుచూపిస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందో చూస్తే ఫిదా అయిపోతారంతే. బామ్మ పిజ్జా తినడం మొదలుపెట్టగానే చిన్నగా నవ్వుతూ అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది. బామ్మ హావభావాలతో పాటు ముసిముసి నవ్వులకు నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు.

ఈ అందమైన వీడియోను greesh_bhatt_ అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘నాని జీ మొదటిసారి పిజ్జా తింటుంది’ అనే క్యాప్షన్‌ అందిచారు. ఈ వీడియోను సోషల్ మీడియా యూజర్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. బామ్మ పిజ్జా రుచిని ఇష్టపడలేదని అనిపిస్తుందంటూ యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. ‘పిజ్జా తినేప్పుడు నాని చూపించిన ఎక్స్‌ప్రెషన్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. నాని చాలా క్యూట్‌గా ఉదంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. వీడియోలో నాని ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌కి సోషల్ మీడియా వ్యాప్తంగా ఫిదా అవుతున్నారు.

Also Read: Viral Video: చిరుత జింకను వేటాడింది.. దానిని పట్టుకుని చెట్టుపైకి ఎక్కింది.. ఇంతలో సీన్‌ రివర్స్‌.. ఏం జరిగిందో చూడండి..!

Viral Video: నాగుపాము- కొండ చిలువ మధ్య భీకరపోరు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..!