లక్షల్లో అమ్ముడు పోతున్న ఫ్యాన్సీ నెంబర్లు..

|

May 23, 2024 | 10:19 PM

వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి లక్కీ నంబర్ లేదా ఫ్యాన్సీ నంబర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వీటిని దక్కించుకునేందుకు వాహన యజమానులు పెద్ద మొత్తం వెచ్చిస్తుంటారు. అయితే గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వేలంలో టీజీ09 9999 ఫ్యాన్సీ నంబర్ ఏకంగా రూ.25,50,002లకు అమ్ముడుపోయింది. సోనీ ట్రాన్స్‌పోర్టు సొల్యూషన్స్‌ దీనిని దక్కించుకుంది.

వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి లక్కీ నంబర్ లేదా ఫ్యాన్సీ నంబర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వీటిని దక్కించుకునేందుకు వాహన యజమానులు పెద్ద మొత్తం వెచ్చిస్తుంటారు. అయితే గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వేలంలో టీజీ09 9999 ఫ్యాన్సీ నంబర్ ఏకంగా రూ.25,50,002లకు అమ్ముడుపోయింది. సోనీ ట్రాన్స్‌పోర్టు సొల్యూషన్స్‌ దీనిని దక్కించుకుంది. తమ టయోటా ల్యాండ్‌ క్రూజర్‌ LX కోసం ఈ భారీ మొత్తాన్ని వెచ్చించింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక వాహన ఫ్యాన్సీ నంబర్‌ ఈ స్థాయి రేటు పలకడం ఇదే తొలిసారి. ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌ వేలం నిర్వహించారు. TG 09 9999 నంబర్‌తో పాటు మరికొన్ని ఫ్యాన్సీ నంబర్లను వేలం వేశారు. దీంతో తెలంగాణ ఆర్టీఏకి ఒకే రోజు ఏకంగా రూ.43,70,284 రాబడి వచ్చిందని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on