జీవితం నీటి బుడగ అంటే ఇదేనేమో.. యువతలో పెరుగుతున్న ఆందోళన, కారణాలు

Updated on: Mar 18, 2026 | 7:58 PM

ఆకస్మిక గుండెపోటు మరణాలు యువతలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వరంగల్ వాసి రాకేష్ (40) అమెరికాలో, ఖమ్మం యువతి సుస్మిత (36) బంధువుల ఇంట్లో అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. నవ్వుతూ మాట్లాడిన కొద్ది క్షణాల్లోనే మృత్యువాత పడటం కలచివేస్తోంది. ఈ అనూహ్య మరణాలకు కారణాలేమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆకస్మిక గుండెపోటు మరణాలు కలవర పరుస్తున్నాయి. సడెన్‌గా అపస్మారక స్థితికి చేరుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. ఏమవుతుందో తెలియడం లేదు.. ఎందుకో అర్థం కావడం లేదు. అప్పటివరకు బాగానే ఉంటున్నారు. నవ్వుతూ మాట్లాడుతున్నారు. క్షణాల్లోనే ఈ లోకాన్ని వీడుతున్నారు. అమెరికాలో వరంగల్‌ వాసి మృతి చెందారు. వర్జీనియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న 40 ఏళ్ల తాడిపత్రి రాకేష్‌ భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. రాకేశ్‌ ఉద్యోగ రీత్యా గత పదేళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో ఆయనకు వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలున్నారు. ఈ కుటుంబం ప్రస్తుతం వర్జీనియా రాష్ట్రంలో నివాసముంటోంది. రాకేశ్‌ తండ్రి జితేందర్‌ వరంగల్‌లో వ్యాపారవేత్త. రాకేష్ చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించాడనే వార్త వరంగల్‌లోని అతని స్వగృహంలో విషాదఛాయలను నింపింది. ఆకస్మిక మరణవార్త తెలియగానే కుటుంబసభ్యులు, బంధువులు రాకేష్‌ ఇంటికి చేరుకుని తల్లితండ్రులను ఓదార్చారు. తెలంగాణలోని ఖమ్మంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఖమ్మం నగరంలోని 3 టౌన్ ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల బొమ్మ సుస్మిత ఆమె బంధువులకు చెందిన ఓ గృహప్రవేశ వేడుకకు వెళ్లింది. వేదికపై బంధువులతో ఫోటో దిగే సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావటం తో కుప్పకూలిపోయింది… వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు.. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…అప్పటి వరకు బంధువులు , స్నేహితులతో నవ్వుతూ సరదాగా గడిపిన సుస్మిత .. అకస్మాత్తు గా మరణించడంతో అందరూ షాకయ్యారు..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లాకర్‌లోని బంగారానికి బ్యాంక్ గ్యారంటీ ఇస్తుందా ??

జాతి వైరం మరిచి.. తల్లి ప్రేమను పంచి.. మానవత్వానికి మూగజీవాల పాఠం

రెచ్చిపోయిన రోడ్‌సైడ్‌ రోమియోలు..

దేవుడు నాకిలా రాసిపెట్టాడేమో.. పవన్ ఎమోషనల్ వీడియో..

చివరికి గట్టెలపొయ్యే గతైంది !! నాగ శౌర్య తల్లి హోటల్ పరిస్థితి ఇది

Loading...
Unable to load recommendations.
Follow Us