Ismart news: కూటమి పార్టీల అధికారం కోసం అరగుండు మొక్కు || కూలీలా మారి గంపలు మోసిన మంత్రి

|

Aug 06, 2024 | 11:02 AM

ఓట్ల ముంగట ఇంటింటికి తిరుక్కుంట, కంటికి కానొచ్చిన పనులన్ని చేస్కుంట.. నేను మీ కట్టు బానిసను అన్నంత బిల్డప్పిస్తరు లీడర్లు.. ఇగ ఓట్లు ఒడ్శినయంటె రాముడెవడో రాకాసుడెవడో అన్నట్టు కంటికి అవుపడ్తె ఒట్టు.. కని ఇగొ.. ఏపీల ఒక మంత్రిసారును, ఎమ్మెల్యే సారును సూస్తుంటె.. అందరట్లనే ఉండరని అన్పియ్యవట్టింది. నిన్నియాల కష్టపడి కూడవెట్కున్న మన సొమ్మును మనం కాపాడుకునుడే కష్టమైతుందమ్మ దొంగలు, మోసగాల్లు చెయ్యవట్టి.

తట్టలు మోశిన మంత్రి.. మోరీలు తీశిన ఎమ్మెల్యే
పాత సీన్లుగాదుల్లో.. ప్రెజెంటు నడుస్తున్న సీన్లే

సైకిల్పార్టీ లీడర్ మొక్కిండు ఎరైటీ మొక్కు
ఇద్దరు దేవుండ్లకిచ్చిండు సగం సగం గుండు

వరినాట్లేశిన మెదక్ కలెక్టర్
పిల్లలకు నేర్పిచ్చుడు సూపర్

ఎమ్మార్వో చేస్తుండు డబుల్ డూటి
బడి పిల్లలకు పాఠాలు నేర్పుతుండు పట్టువట్టి

ఓట్ల ముంగట ఇంటింటికి తిరుక్కుంట, కంటికి కానొచ్చిన పనులన్ని చేస్కుంట.. నేను మీ కట్టు బానిసను అన్నంత బిల్డప్పిస్తరు లీడర్లు.. ఇగ ఓట్లు ఒడ్శినయంటె రాముడెవడో రాకాసుడెవడో అన్నట్టు కంటికి అవుపడ్తె ఒట్టు.. కని ఇగొ.. ఏపీల ఒక మంత్రిసారును, ఎమ్మెల్యే సారును సూస్తుంటె.. అందరట్లనే ఉండరని అన్పియ్యవట్టింది..

నిన్నియాల కష్టపడి కూడవెట్కున్న మన సొమ్మును మనం కాపాడుకునుడే కష్టమైతుందమ్మ దొంగలు, మోసగాల్లు చెయ్యవట్టి. ఇంట్లె దాస్కుందామంటె దొంగల భయమాయె.. బ్యాంకుల దాస్కుందామంటె, సైబర్ మోసగాళ్లతోని భయమాయె.. అంతేనా.. ఇగొ.. ఆ దొంగలు, మోసగాళ్లు గాకుంట.. ఇగొ గిసంటి తాశిడిగాల్ల కేటగిరీగూడ మోపైతుంది.. మంది సొమ్మును మాయంజేస్తందుకు..

ఎవలన్న నెత్తెంటికెల మొక్కు మొక్కితె.. దేవుడా నేను కోరింది జరిగితె గుండు కొట్టిస్తా అని మొక్కుతరు.. లేదంటె ఐదు కత్తెర్లో, మూడు కత్తెర్లో మొక్కుతరు.. కని గా కాకినాడ జిల్లాల ఒగన్న మొక్కిన మొక్కు సూస్తె, ఇదెక్కడి మొక్కు సామీ.. అని మూర్ఛ పోతర్ గావచ్చు.. ఇగ సూడుర్రా శిత్రమైన మొక్కేందో?

నిన్నియాల పిలగాల్లు ఎట్ల వెరుగుతున్నరంటె.. మమ్మీ మమ్మీ.. బియ్యం ఏ చెట్టుకు కాస్తయ్ మమ్మీ అని అడిగేటంత తెల్వితోటి వెరుగుతున్నరు. ఇగ పట్నంల పిలగాల్లయితె నెరీ అద్మానముల్ల.. కూరగాయలు ఏ కంపిన్ల తయారైతయ్ డాడీ అని అడిగేటంత అడ్వాన్సుంటరు.. అగొ అందుకే.. అట్ల గావొద్దంటె గీ సారోల్ల లెక్క అప్పుడప్పుడు పిల్లలను పొలంలకు వట్కపోతె మంచిగ..

కొందరు మన్షులకు కొంటె పనులు చెయ్యాలని శేతులకు దుర్దవుట్టినట్టు.. ఎల్కలగ్గూడ ఏదో ఒకటి కొర్కకుంటె పండ్లు దుర్ద వెడ్తయట.. సరే.. కొడ్తె కొట్టినయ్.. వాటి గుణం వాటిది అనుకుందామంటె.. ఏం దొర్కనట్టు బీర్వల దాస్కున్న ఐదొందల నోట్లను ఎట్ల పొట్టుపొట్టు కొట్టేశినయ్ సూడీ రైతన్నయ్

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on