Model in hotel: డిన్నర్ ఆర్డర్ చేసిన మోడల్‌.. డెలివరీ ఇవ్వడానికి వచ్చిన బోయ్‌ అక్కడి సీన్‌ చూసి షాక్‌..

|

Oct 07, 2022 | 9:28 AM

ఆ రోజు రాత్రి డిన్నర్‌ ఆర్డర్‌ చేసిన మోడల్‌ మర్నాడు ఉదయం ఎంతసేపటికీ డోర్ తీయకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు..


ముంబైలో ఓ మోడల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అంథేరికి చెందిన ఓ హోట‌ల్ రూమ్‌లో 30 ఏళ్ల మోడ‌ల్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సప్టెంబర్‌ 28న ఈ సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి డిన్నర్‌ ఆర్డర్‌ చేసిన మోడల్‌ మర్నాడు ఉదయం ఎంతసేపటికీ డోర్ తీయకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. డోర్‌ను తెరిచి చూడగా శవమై కనిపించింది. సదరు మోడల్ ను ఆకాంక్ష మోహన్‌గా గుర్తించారు. పోలీసులు ఆ రూమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా.. సూసైడ్ నోట్ లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోడల్ ఆకాంక్ష సెప్టెంబర్‌ 28 రాత్రి 8 గంట‌ల‌కు హోట‌ల్‌కు చెకిన్ అయ్యిందని, డిన్నర్ కూడా ఆర్డర్ చేసిందని తెలిపారు. కానీ మర్నాడు ఉదయం హౌజ్‌ కీపింగ్ సిబ్బంది క్లీనింగ్‌ కోసం వెళ్లి ఎంత పిలిచినా ఆమె డోర్ ఓపెన్ చేయకపోవడంతో వారు హోట‌ల్ మేనేజ‌ర్ కు విషయం చెప్పారు. వెంటనే యాజమాన్యం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు మాస్టర్ కీ ద్వారా ఆ రూమ్ త‌లుపును ఓపెన్ చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్‌కు వేలాడుతూ మోడ‌ల్ ఆకాంక్ష మోహన్ శవం కనిపించింది.మోడల్ ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ రూమ్ నుంచి ఓ సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐ యామ్ సారీ, నా చావుకు ఎవ‌రూ బాధ్యులు కారు, నేను సంతోషంగా లేను.. నాకు ప్రశాంతత కావాలి అని సూసైడ్ నోట్‌లో ఆకాంక్ష రాసినట్లు పోలీసులు తెలిపారు. మృత‌దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెర్సోవా పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Follow us on