Watch Video: కోట్లకు పడగలెత్తిన ఒంటె.. అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెడతారంతే.. వైరల్ వీడియో..

|

May 09, 2022 | 12:39 PM

ఇంత ఎక్కువ ధర పెట్టి ఈ ఒంటెను కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరనేది వీడియోలో వెల్లడించలేదు. ఇంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ఈ ఒంటె ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఒంటె జాతుల్లో అత్యంత అరుదైనది కావడం విశేషం.

Watch Video: కోట్లకు పడగలెత్తిన ఒంటె.. అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెడతారంతే.. వైరల్ వీడియో..
Viral Camel Video
Follow us on

జంతువులను అధిక ధరలకు అమ్మడం, కొనడం మనం చూస్తేనే ఉంటాం. అయితే తాజాగా ఓ జంతువు ఎంత ధరకు అమ్ముడైందో తెలిస్తే మాత్రం మూర్ఛ పోవాల్సిందే. అవును.. వేలంలో ఓ ఒంటె(Camel)ను ఏకంగా అత్యధిక ప్రైజ్‌కు కొనుగోలు చేయడంతో చుట్టుపక్కల ఉన్నవారే కాదు.. ఈ వీడియో(Viral video) చూసిన వారంతా అవాక్కవుతున్నారు. అసలు ఒంటె ఏంటి, దానికి అంత దర ఏంది అని ఆశ్చర్యపోతున్నారా? పదండి అసలు విషయం తెలుసుకుందాం. సౌదీ అరేబియాలో ఈ ఒంటెను చాలా ఖరీదైన ధరకు విక్రయించారు. ఈ ఒంటె ప్రపంచంలోనే అత్యంత విలువైన ఒంటెగా మారిపోయింది. ఈ ఒంటెను 7 మిలియన్ సౌదీ రియాల్స్ అంటే దాదాపు మన కరెన్సీలో రూ. 14 కోట్ల 23 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు.

‘గల్ఫ్ న్యూస్’ ప్రకారం, సౌదీ అరేబియాలో ఈ ఒంటె అమ్మకం కోసం బహిరంగ వేలం నిర్వహించారు. వేలానికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీనిలో ప్రజలు సంప్రదాయ దుస్తులను ధరించి, మైక్రోఫోన్ ద్వారా ఒంటెను వేలం వేస్తున్నట్లు చూడొచ్చు. వేలం సమయంలో మొదట్లో ఒంటె ధర రూ. 10 కోట్ల 60 లక్షలు ఉండగా, బిడ్డింగ్ తర్వాత రూ. 14 కోట్ల 23 లక్షలకు కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. ఇంత ఎక్కువ ధర పెట్టి ఈ ఒంటెను కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరనేది వీడియోలో వెల్లడించలేదు. ఇంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ఈ ఒంటె ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఒంటె జాతుల్లో అత్యంత అరుదైనది కావడం విశేషం. ఈ జాతికి చెందిన ఒంటెలు ప్రపంచంలో చాలా అరుదుగా కనిపిస్తాయంట. అందుకే దీనికి అంత ధర పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Viral Video: ఇక్కడ నేనుంటే.. అలా ఎలా పడుకుంటావ్..! గాఢ నిద్రలో ఉన్న కుక్కను లేపిన తాబేలు.. చివరకు ఊహించని షాక్

Viral Video: నాతోనే గేమ్సా.. పట్టు పడితే ఫసక్కే.. నెట్టింట్లో వైరలవుతోన్న మొసలి వీడియో.. చూస్తే షాకవుతారంతే..