తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం

Updated on: Nov 24, 2026 | 8:12 PM

తిరుప్పరంకుండ్రంలో కార్తీక దీపం పాత ప్రదేశంలోనే వెలిగింది. కొండపై దీపం వెలిగించాలన్న సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలను తమిళనాడు ప్రభుత్వం అమలు చేయలేదు. భక్తులు, ప్రతిపక్షాల ఆందోళనలు, మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలను లెక్కచేయకుండా, శాంతిభద్రతల సాకుతో ప్రభుత్వం నిర్ణయం పై వెనక్కి తగ్గలేదు.

తిరుప్పరంకుండ్రంలో కార్తీక దీపం ఎప్పట్లాగే కొండ దిగువన ఉన్న ఉచ్చి పిళ్ళయ్యార్ ఆలయ మండపంలోనే వెలిగింది. కొండపై ఉన్న దీపతూన్ దగ్గర దీపాన్ని వెలిగించడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం అమలు చేయలేదు. దశాబ్దాలుగా పాటిస్తున్న సంప్రదాయానికి భిన్నంగా ఈసారి హిందువులు కొండ పైభాగంలో, సికిందర్ బాద్షా దర్గాకి సమీపంలో దీపం వెలిగించాలని పట్టుబట్టారు. ఈ వివాదంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఈసారి ఒక్కసారి మాత్రమే దీపతూన్ దగ్గర దీపం వెలిగించడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలపై రివ్యూ పిటిషన్ వేసింది. మధురై కలెక్టర్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. భక్తులు ఆందోళనలు చేసినా, మద్రాస్ హైకోర్టు భక్తుల దర్శనానికి ఆటంకం కలగకూడదని వ్యాఖ్యానించినా, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోలేదు. శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఆంక్షలు విధించామని అధికార వర్గాలు చెప్పాయి. చివరకు, కట్టుదిట్టమైన భద్రత మధ్య దీపారాధన పాత స్థలంలోనే ముగిసింది.

Published on: Nov 24, 2026 08:12 PM
Loading...
Unable to load recommendations.
Follow Us