ధైర్యం ఉంటేనే ఈ సీన్ చూడండి.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో
విశాఖపట్నం, వేపగుంటలోని సింహపురి లేఅవుట్‌లో కాలువలో 10 అడుగుల భారీ కొండచిలువ ప్రత్యక్షమవడంతో స్థానికులు భయాందోళన చెందారు. పెద్ద జంతువును మింగి కదలలేని స్థితిలో ఉన్న ఈ కొండచిలువ గురించి స్నేక్ క్యాచర్ మణికి సమాచారం అందింది. సవాలుగా మారిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో, మణి అసిస్టెంట్ సహాయంతో చాకచక్యంగా దానిని బంధించారు. అనంతరం సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా వేపగుంట పరిధిలోని సింహపురి లేఅవుట్‌లో ఒక్కసారిగా గుండె గుభేల్‌మనే దృశ్యం ప్రత్యక్షమైంది. నిత్యం జనంతో రద్దీగా ఉండే రోడ్డు పక్కన కాలువలో పది అడుగుల భారీ కొండచిలువ ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. అందరూ తమ పనుల్లో తాము నిమగ్నమై ఉన్న సమయంలో, కాలువలో వినిపించిన వింత శబ్దాలతో కొందరు అటువైపు తొంగి చూశారు. కదల్లేని స్థితిలో ఉన్న భారీ కొండచిలువ కనిపించింది. వెంటనే అక్కడినుంచి పరుగులు తీశారు. బహుశా ఏదైనా పెద్ద జంతువును మింగి ఉండటంతో, అది కదలలేక కాలువలోనే ఉండిపోయిందని భావించిన స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. స్థానికుల సమాచారంతో ప్రముఖ స్నేక్ క్యాచర్ మణి, ఘటనాస్థలికి చేరుకున్నారు. కాలువలో బురద మధ్యన ఉన్న ఆ భారీ కొండచిలువను పట్టుకోవడం అతనికి సవాలుగా మారింది. ఒక్కసారిగా చిక్కినట్టే చిక్కి జారిపోయిన ఆ కొండచిలువను, మరో వ్యక్తి సహకారంతో ఎట్టకేలకు బంధించారు. పది అడుగుల భారీ పైథాన్‌ను రెస్క్యూ చేసి సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సాహసోపేతంగా పామును పట్టుకున్న మణిని గ్రామస్తులందరూ అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్
OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్.. రసవత్తరంగా సాగే కథ
IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే
భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్ ఓటీపీ
The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు
