ఎలక్ట్రికల్ షాపులో అర్థరాత్రి చోరి.. దర్జాగా దోచుకెళ్లిన దొంగలు… వీడియో వైరల్

దొంగలు రెచ్చిపోతున్నారు.. తాళం వేసి ఉన్న షాపుల్లో చోరీలకు పాల్పడుతున్నారు. మహబూబ్‌నగర్‌ లో ఓ ఎలక్ట్రికల్‌ షాపులో చోరీకి పాల్పడ్డారు. అయితే సీసీటీవీకి చిక్కారు దొంగలు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని పాతబస్టాండ్ చౌరస్తాలో ఉన్న ఓ ఎలక్ట్రికల్ షాపులో అర్థరాత్రి ఓ దొంగల ముఠా హల్‌చల్ చేసింది.

దొంగలు రెచ్చిపోతున్నారు.. తాళం వేసి ఉన్న షాపుల్లో చోరీలకు పాల్పడుతున్నారు. మహబూబ్‌నగర్‌ లో ఓ ఎలక్ట్రికల్‌ షాపులో చోరీకి పాల్పడ్డారు. అయితే సీసీటీవీకి చిక్కారు దొంగలు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని పాతబస్టాండ్ చౌరస్తాలో ఉన్న ఓ ఎలక్ట్రికల్ షాపులో అర్థరాత్రి ఓ దొంగల ముఠా హల్‌చల్ చేసింది. షాప్‌ తలుపులను పగులగొట్టి లోనికి ప్రవేశించిన నలుగురు దొంగలు కాపర్ వైర్ బస్తాలను ఎత్తుకెళ్లారు. దర్జాగా ఏడు కాపర్ బస్తాలను ఎత్తుకెళ్లారు. దొంగతనానికి పాల్పడిన నలుగురి ముఖాలు సిసి కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. కాపర్ వైర్ విలువ గురించి తెలిసిన స్థానిక వ్యక్తులే ఈ చోరీకి పాల్పడి ఉంటారని షాప్‌ యజమానులు భావిస్తున్నారు.

షాప్‌ ఓనర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కాగా, తమ షాపులకు రక్షణ కల్పించాలని వ్యాపారులు కోరుతున్నారు. 
మరిన్ని చదవండి ఇక్కడ : Ek Number News: రొయ్యల చెరువుల్ల దెయ్యాల లొల్లి | చెప్పుల్లో బ్లూటూత్.నకలు కొట్టెతందుకు నకరాలు..(వీడియో)

 స్కూల్‌ ప్రిన్సిపల్‌ బదిలీతో చలించిపోయిన విద్యార్థులు.. మాస్టారు కోసం..కన్నీటి వీడ్కోలు..!(వీడియో)

 Cyclone Gulab Live Updates Video: గర్జిస్తున్న గులాబ్‌.. భయం గుపిట్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనం… (లైవ్ వీడియో)

 Hyderabad Rains Live Updates Video: హెచ్చరిక .. ఎవరూ బయటకు రావొద్దు..! చెరువుల్లా మారిన సిటీ రోడ్లు..(వీడియో)

Click on your DTH Provider to Add TV9 Telugu