Viral Video: పోకిరీ వెకిలి చేష్టలు..వేగలేక తగిన శాస్త్రి చేశారు..! ఆడవారు అంత కలిసి ప్లాన్ చేసి మరి ఇలా.. (వీడియో)

Updated on: Nov 18, 2021 | 9:33 AM

ఓ యువకుడి వెకిలి చేష్టలకు గత కొద్ది రోజులుగా అక్కడి బాలికలు స్కూల్‌కి వెళ్లాలంటేనే హడలిపోయేవారు. ప్రతిరోజూ స్కూల్‌కి వెళ్తూ వచ్చే విద్యార్థులను వేధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న కంత్రీగాడి బాధ భరించలేక...


ఓ యువకుడి వెకిలి చేష్టలకు గత కొద్ది రోజులుగా అక్కడి బాలికలు స్కూల్‌కి వెళ్లాలంటేనే హడలిపోయేవారు. ప్రతిరోజూ స్కూల్‌కి వెళ్తూ వచ్చే విద్యార్థులను వేధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న కంత్రీగాడి బాధ భరించలేక ఆ విద్యార్థులు చివరకు విషయాన్ని తల్లిదండ్రులు, గ్రామస్థులకు చెప్పారు..దీంతో ఆకతాయిని మాటువేసి పట్టుకున్న గ్రామస్తులు తగిన గుణపాఠం చెప్పారు. పోకిరీని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.. జి.సిగడాం మండలం సీతంపేట పంచాయతీ గేదెలపేట గ్రామస్తులు ఆకతాయికి బుద్ది చెప్పారు.

గేదెలపేట గ్రామం నుంచి విద్యార్థినులు పక్కనే ఉన్న పొగిరి జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకోవడానికి వెళ్తుంటారు. గత వారం రోజులుగా వీరిని రాజాం మున్సిపాలిటీలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీనివాసరావు వీరిపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో విసిగిపోయిన బాలికలు తల్లిదండ్రులు, గ్రామస్థులకు విషయం తెలియజేశారు. వారంతా కలిసి అతన్ని పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చారు. ఊళ్లోని రామాలయం వద్ద స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Loading...
Unable to load recommendations.
Follow Us