Viral Video: స్టూడెంట్ ఆన్సర్ షీట్ చూసి కోమాలోకి టీచర్.. తెలివైన విద్యార్ధి అంటూ నెటిజన్స్ కామెంట్స్..(వీడియో)
పరీక్షల్లో ఓ విద్యార్ధి రాసిన ఆన్సర్ షీట్ చూసి టీచర్ కోమాలోకి వెళ్లిపోయారు. ఆ విద్యార్ధి ఏం రాశాడో తెలిస్తే మీరూ నవ్వకుండా ఉండలేరు. ఇంతకీ క్వశ్చన్ పేపర్‌లో ఏమడిగారంటే... హిమాచల్ ప్రదేశ్‌లోని బాక్రానంగల్ ప్రాజెక్టు గురించి రాయమని క్వశ్చన్... దానికి విద్యార్ధి ఆన్సర్ రాస్తూ..
పరీక్షల్లో ఓ విద్యార్ధి రాసిన ఆన్సర్ షీట్ చూసి టీచర్ కోమాలోకి వెళ్లిపోయారు. ఆ విద్యార్ధి ఏం రాశాడో తెలిస్తే మీరూ నవ్వకుండా ఉండలేరు. ఇంతకీ క్వశ్చన్ పేపర్‌లో ఏమడిగారంటే… హిమాచల్ ప్రదేశ్‌లోని బాక్రానంగల్ ప్రాజెక్టు గురించి రాయమని క్వశ్చన్… దానికి విద్యార్ధి ఆన్సర్ రాస్తూ.. ఈ డ్యామ్‌ను సట్లెజ్ నదిపై నిర్మించారని కరెక్ట్‌గానే రాసాడు. ఆ తర్వాత బాక్రానంగల్ వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు.. సర్ధార్ వల్లభాయ్ పటేల్, టాటా-బైబై, పండిట్ జవహర్‌లాల్ నెహ్రు, గులాబీ పూల పెంపకం, లండన్, జర్మనీ, ఇంకా రెండో ప్రపంచయద్ధం లాంటి అంశాలను రాసుకొచ్చాడు. మళ్లీ చివరిలో పంజాబ్ వచ్చి సట్లెజ్ నది గురించి రాస్తూ ఆన్సర్ ముగించాడు. ఇదంతా చదివిన టీచర్ షాక్ అయ్యారు. 10కి సున్నా మార్కులు వేశారు. అంతేకాదు… ఆ టీచర్… ఆన్సర్ చివరలో “టీచర్ కోమాలో ఉన్నారు” అని రాశారు.
నిజంగా కోమాలోకి వెళ్లకపోయినా… ఇలాంటిది చదివితే… కోమాలోకి వెళ్లడం ఖాయమనే అర్థం వచ్చేలా రాశారు. ఈ ఆన్సర్ షీట్ ఇప్పడు నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చదివిన నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. “ఒక ఆన్సర్‌లో చరిత్ర, భౌగోళికం, కళలు, సాహిత్యం అన్నీ చెప్పగలరా… అన్ని చెప్పే విద్యార్థి ఏ టీచర్‌కి దొరుకుతారు” అంటూ కొందరు, ఈ ఆన్సర్ రాసిన విద్యార్థికి 21 ఫిరంగులతో వందనం చెయ్యాలి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..