చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు.. చంద్రుడు ఎవరి సొత్తు?

Updated on: Oct 13, 2026 | 12:05 PM

చంద్రుడిపై మానవ నివాసాలకు విద్యుత్ అత్యవసరం. సౌరశక్తి పరిమితుల వల్ల అమెరికా, రష్యా, చైనా అణు విద్యుత్ రియాక్టర్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి. నాసా 2030 నాటికి 20 కిలోవాట్ల రియాక్టర్‌ను, రష్యా-చైనా 2036 నాటికి సెలెనా రియాక్టర్‌ను ప్రతిపాదిస్తున్నాయి. అయితే, రవాణా, రేడియేషన్ ప్రమాదాలు వంటి సవాళ్లు ఉన్నాయి. 1967 ఒప్పందం ప్రకారం చంద్రుడు ఎవరి సొంతం కాదు.

చంద్రుడిపై మనుషులు నివసించేలా శాశ్వత స్థావరాలను ఏర్పాటు చేయాలనే అగ్రరాజ్యాల కలలు నెరవేరాలంటే విద్యుత్ అత్యంత కీలకం. భూమిపై ఉన్న జల, పవన విద్యుత్ వనరులు జాబిల్లిపై లేవు. సౌరశక్తికి దాని సొంత పరిమితులు, ముఖ్యంగా సుదీర్ఘ చంద్ర రాత్రులు ఆటంకం. ఈ నేపథ్యంలో, అణు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా నిరంతర విద్యుత్ సరఫరాకు దేశాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. అమెరికా, రష్యా, చైనాలు ఈ పోటీలో ముందున్నాయి. నాసా 2030 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువంలో 20 కిలోవాట్ల సామర్థ్యం గల లూనార్ రియాక్టర్-1ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఐదేళ్లపాటు నిరంతరాయంగా పనిచేయగలదు. మరోవైపు, చైనా సహకారంతో రష్యా 2036 నాటికి సెలెనా అనే న్యూక్లియర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది. ఇది పదేళ్లపాటు 10 కిలోవాట్ల విద్యుత్‌ను అందించగలదు.

మరిన్ని వీడియోల కోసం :

అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?

నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!

టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు

రజినీకాంత్ ట్రిపుల్ ధమాకా.. అంత తొందరేంటో..?

హిట్ కొట్టాలంటే డీ గ్లామర్ తప్ప మరో దారిలేదా..?

Loading...
Unable to load recommendations.
Follow Us