గంటల దొంగ.. దొరికాడు ఇలా..!

Updated on: Jul 12, 2026 | 6:33 PM

లక్నోలోని ప్రముఖ బుద్ధేశ్వర్ ఆలయంలో వరుసగా గంటలు చోరీకి గురవుతుండగా, స్థానికుల అప్రమత్తతతో దొంగను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆలయంలోనే సేవకుడిగా పనిచేస్తున్న వ్యక్తే ఈ చోరీలకు పాల్పడినట్లు తేలింది. అతడి వద్ద నుంచి ఆలయ గంటలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దేవుడి సేవలో ఉంటూ, ఆలయ సొత్తునే దొంగిలిస్తున్న ఓ కేటుగాడి గుట్టు రట్టు చేసారు స్థానికులు. ఉత్తరప్రదేశ్ లక్నోలోని ప్రముఖ బుద్ధేశ్వర్ ఆలయంలో గత కొన్ని రోజులుగా నిరంతరం ఆలయ గంటలు చోరీకి గురవుతుండటం తీవ్ర కలకలం రేపింది. అయితే, ఎట్టకేలకు స్థానికుల అప్రమత్తతతో గంటల దొంగ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఆలయంలోనే సేవకుడిగా ఉంటూ, నిత్యం శృంగార హారతి ఏర్పాట్లలో పాల్గొనే గోలు అలియాస్ గౌరవ్ అనే వ్యక్తి ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఆలయ గంటను దొంగిలించి పారిపోతుండగా స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి చోరీకి గురైన ఆలయ గంటను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో జరిగిన పలు దొంగతనాల్లోనూ ఈ సేవకుడి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా యంత్రాంగం పరిధిలో ఈ ఆలయ పర్యవేక్షణ బాధ్యతలు ఉన్నాయని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు పారా పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పారా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగిలించిన గంటలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్ధరాత్రి వీధుల్లో యువకులు.. దేనికో తెలుసా!

వామ్మో… ఈ శునకం ట్యాలెంట్‌ మామలుగా లేదు!

సమోసా కోసం.. లోకోపైలెట్ ట్రైన్ ఆపాడా? నెట్టింట వీడియో వైరల్.. ఎంతవరకు నిజం?

కలను సాకారం చేసిన.. రూ.10 కాయిన్లతో రూ.1.10 లక్షల బైక్!

పెట్రోల్‌లో ఇథనాల్ మిక్సింగ్‌తో వాహనాలు చెడిపోతాయా? నిజమెంత?

Loading...
Unable to load recommendations.
Follow Us