డ్రైవర్ లేకుండానే రివర్స్‌లో దూసుకెళ్లిన కారు..

Updated on: Oct 20, 2026 | 4:10 PM

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో డ్రైవర్ లేకుండానే టాటా టియాగో ఈవీ కారు ముందుకు, ఆ తర్వాత రివర్స్‌లో కదలడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కారు శుభ్రం చేస్తున్న సమయంలో యజమాని మేనల్లుడు కిందపడినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. వాహనంలో సాంకేతిక లోపం ఉందని యజమాని అనుమానిస్తూ టాటా మోటార్స్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో ఓ వింత ఘటన వెలుగుచూసింది. డ్రైవర్ లేకుండానే ఓ ఎలక్ట్రిక్ కారు దానంతట అదే కదిలి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మెయిన్‌పురిలోని జైల్ రోడ్డు వద్ద చోటుచేసుకున్న ఈ వింత ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కారు యజమాని సౌరభ్ రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన ఆఫీసులో ఉన్న సమయంలో ఆయన మేనల్లుడు కారును శుభ్రం చేయడానికి బయటకు తీశాడు. ఆ సమయంలో కారు కీ కూడా లోపల లేదు. అయితే అకస్మాత్తుగా ‘టాటా టియాగో ఇవి’ కారు దానంతట అదే ముందుకు కదిలి, మేనల్లుడిని కిందపడేసింది. అంతటితో ఆగకుండా ఒక్కసారిగా రివర్స్‌లో దూసుకెళ్లింది. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న వారంతా ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్ లేకుండానే కారు కదలడం చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, వాహనంలో ఏదో తీవ్రమైన సాంకేతిక లోపం ఉండి ఉంటుందని సౌరభ్ రాథోడ్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై టాటా మోటార్స్ కంపెనీకి అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆయన స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు, నిపుణులు పరిశీలిస్తున్నప్పటికీ, కారు అలా దానంతట అదే కదలడానికి గల కచ్చితమైన కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమలాపురంలో అరుదైన వేలం.. అమ్మవారి మెడలో దండ వేయాలంటే..

తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తున్న విద్యుత్‌ డిమాండ్‌

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ఆహార నిల్వల్లో దూసుకెళ్తున్న చైనా.. మరి భారత్‌ పరిస్థితేంటి?

అమ్మ కోసం 12 జ్యోతిర్లింగాలకు పరుగు.. రోజుకు 50 కి.మీ. రన్..

సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న ఐఫోన్లు.. ఎగబడిన జనాలు

Loading...
Unable to load recommendations.
Follow Us