రూ. లక్ష క్యాష్‌ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన శునకం..!

Updated on: May 26, 2026 | 12:58 PM

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఓ వీధి కుక్క లక్ష రూపాయల నగదు ఉన్న సంచిని ఎత్తుకెళ్లిన ఘటన సంచలనంగా మారింది. నమాజ్ కోసం మసీదు వద్ద బైక్‌కు సంచిని తగిలించి వెళ్లిన వ్యాపారవేత్తకు షాక్ తగిలింది. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు, డబ్బు సంచిని కుక్క నోట కరచుకుని వెళ్లిపోయినట్లు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో‌ని బిజ్నోర్ లో విచిత్ర ఘటన జరిగింది. ఓ వ్యాపారవేత్తకు చెందిన లక్ష రూపాయల క్యాష్‌ ఉన్న సంచిని శునకం నోట కరచుకుని పారిపోయింది. సాధారణంగా దొంగలు డబ్బులు కొట్టేయడం చూస్తుంటాం. కానీ ఇలా ఓ కుక్క ఏకంగా లక్ష రూపాయల నగదును ఎత్తుకెళ్లడంతో స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రస్తుతం ఆ కుక్క కోసం, అది ఎత్తుకెళ్లిన డబ్బుల సంచి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. బిజ్నోర్ జిల్లాకు చెందిన ఆ వ్యాపారవేత్త బ్యాంకు నుంచి లక్ష రూపాయల క్యాష్‌ను విత్‌డ్రా చేసాడు. ఆ డబ్బును భద్రంగా ఒక సంచిలో పెట్టుకుని తన బైక్‌పై బయల్దేరాడు. నమాజ్‌కు సమయం కావడంతో మార్గమధ్యంలో ఓ మసీదు వద్ద బైక్‌ను ఆపాడు. డబ్బుల సంచిని బైక్‌కే తగిలించి, మసీదు లోపలికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే తిరుగుతున్న ఓ వీధి శునకం కన్ను ఆ సంచిపై పడింది. అందులో ఏదైనా తినే పదార్థం ఉందేమోనని భ్రమపడి క్షణాల వ్యవధిలో దానిని నోట కరచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. నమాజ్ ముగించుకుని బయటకు వచ్చిన వ్యాపారవేత్తకు బైక్‌పై సంచి కనిపించకపోవడంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఎవరో దొంగలు తన డబ్బును కాజేశారని కంగారుపడుతూ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మసీదు పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఆ విజువల్స్ చూసిన పోలీసులతోపాటు వ్యాపారవేత్త కూడా నోరెళ్లబెట్టారు. అక్కడ దొంగతనం చేసింది మనుషులు కాదని, ఓ వీధి కుక్క అని సీసీటీవీ ఫుటేజీ ద్వారా స్పష్టమైంది. ప్రస్తుతం ఈ సీసీటీవీ విజువల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Randeep Hooda: ఆ సినిమాలో ఇరుక్కుని.. మరిన్ని ఇబ్బందులు పడాలనుకోలేదు

Donald Trump: మోదీకి నేను బిగ్‌ ఫ్యాన్‌.. ఏది అడిగినా ఇచ్చేస్తా

చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా

రోడ్ కిందే చార్జింగ్ పాయింట్స్ ! రన్నింగ్‌ వెహికిల్‌కు క్షణాల్లో ఛార్జింగ్.!

Follow Us